దారుణం: క్వారంటైన్ లో సెంటర్ లో ఆత్మహత్య చేసుకున్న మహిళ !

Update: 2020-09-11 17:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు రోజు రోజుకు మరింతగా పెరిగిపోతున్నాయి.  ప్రతిరోజూ సరాసరి 10వేలకు పైగా కరోనా పాజిటివ్  కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎంతగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కేసులు ఏ మాత్రం తగ్గడంలేదు. ఇదిలా ఉంటే , పాజిటివ్ గా తేలిన వారిలో చాలామందిని ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ లో ఉంచుతున్నారు. ఇంట్లో వసతి లేనివారిని , సీరియస్ కేసుల వారిని మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ల లో పెడుతున్నారు. అయితే క్వారంటైన్ సెంటర్‌ భవనం పైనుంచి దూకేసి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

ఈ ఘటన ప్రకాశం జిల్లా , ఒంగోలు లో చోటుచేసుకుంది. ఒంగోలు లో కరోనా సోకిన మహిళ, ఆమె భర్తను ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. క్వారంటైన్ సెంటర్ ‌లో చికిత్స పొందుతున్న మహిళ ఊహించని విధంగా అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకుంది. కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకి పాల్పడింది.  మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన కారణాలు తెలియాల్సి ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు. కరోనా భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
Tags:    

Similar News