అంబటి రాంబాబు కొత్త స్టెప్పులు చూశారా.. వీడియో వైరల్!
అవును... నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చే వాళ్లు ఏడ్వని, పొగిడే వాళ్లు పొగడని, తిట్టేవాళ్లు తిట్టని డోంట్ కేర్ అన్నట్లుగా సంక్రాంతి వచ్చిందంటే తనదైన డ్యాన్స్ తో అంబటి రాంబాబు చెలరేగిపోతుంటారు.;
తెలుగు రాష్ట్రాల్లో.. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. బుధవారం ఉదయమే భోగి మంటలతో పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో ఈ సంబరాలను తనదైన శైలిలో ప్రత్యేకంగా జరుపుతూ.. తనదైన డ్యాన్స్ స్టెప్పులతో అలరించే అంబటి రాంబాబు ఈ ఏడాది కంటిన్యూ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో... సోషల్ మీడియాలో కామెంట్లు, ట్రోలింగ్స్, మీమ్స్ స్టార్ట్ అయిపోయాయి!
అవును... నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చే వాళ్లు ఏడ్వని, పొగిడే వాళ్లు పొగడని, తిట్టేవాళ్లు తిట్టని డోంట్ కేర్ అన్నట్లుగా సంక్రాంతి వచ్చిందంటే తనదైన డ్యాన్స్ తో అంబటి రాంబాబు చెలరేగిపోతుంటారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి కాలు కదిపారు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను లైట్ తీసుకుంటూ.. మీడియా ముందు, అవును తాను సంక్రాంతి సంబరాల రాంబాబునే అని నొక్కి చెబుతూ... మళ్లీ మొదలుపెట్టారు. తన ఎనర్జీని, సంక్రాంతి స్ఫూర్తిని కొనసాగించారు!
ఈ సందర్భంగా స్పందించిన రాంబాబు... తాను ఎక్కడుంటే.. అక్కడే సంబురాలు చేయాలని అనుకున్నానని.. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేస్తున్నందుకు.. ఈసారి ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాను సంక్రాంతి సంబురాలు చేస్తాను.. డ్యాన్సులు చేస్తాను.. అందువల్ల సంబురాల రాంబాబు అంటూ గతంలో కొందరు ఎగతాళి చేశారు.. అలా మాట్లాడేవాళ్లు ఆ పని చేయలేరు.. ఎందుకంటే నేను పొలిటీషియన్ ను.. వాళ్లు కాదు.. అంటూ రియాక్ట్ అయ్యారు.
ఇదే క్రమంలో... మెడికల్ కాలేజీల పీపీపీని వ్యతిరేకిస్తూ ఈరోజు జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశామని.. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగాలని.. ఆ జీవోను ఉపసంహరించుకునేంత దాకా తమ పోరాటం కొనసాగుతుందని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా... సంక్రాంతి సంబరాల్లో అంబటి రాంబాబు తాజా స్టెప్పులతో హల్ చల్ చేయడంతో సోషల్ మీడియాలో సందడి షురూ అయ్యింది!