రేప్ చేశారని ఆరోపించింది.. కేసు పెట్టిన ఆమె అరెస్టు
అవును.. ఇలాంటి ఆడోళ్లు ఉంటారు. చాలామంది ఊహించటానికి కూడా ఇష్టపడని యాంగిల్ లో తప్పులు చేసే మహిళలు చేసే పనులు మిగిలిన వారికి తలనొప్పులు తెచ్చి పెట్టేలా చేస్తుంటాయి. తాజా ఉదంతం ఆ కోవలోకి చెందింది. ఏ మహిళా.. తాను రేప్ కు గురయ్యానని అబద్ధం చెప్పటానికి ఇష్టపడరని అనుకుంటాం. కానీ.. ఇప్పుడు మేం చెప్పే ఉదంతంలో అలాంటి ‘మహా తల్లులు’ కూడా ఉంటారన్న చేదు నిజం ఒకటి బయటకు వచ్చింది.
తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టిన యువతిని కటకటాల వెనక్కి నెట్టారు హర్యానాలోని గురుగ్రామ్ పోలీసులు. అసలేం జరిగిందంటే..
తనపై ఎనిమిది మంది అత్యాచారం చేశారంటూ ఒక మహిళ పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో.. మరో ఆలోచన లేకుండా.. ఆమె మాటల్ని నమ్మిన పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ దారుణంపై కఠినంగా వ్యవహరించాలని రంగంలోకి దిగారు. కేసు విచారణలో భాగంగా పోలీసులకు లభ్యమైన వివరాలు.. ఆధారాలతో వారి నోట మాట రాని పరిస్థితి. డబ్బులకు ఆశ పడిన యువతి.. తన తల్లితో కలిసి గురుగ్రామ్ లో ఉంటూ.. హనీ ట్రాప్ విసిరి మగాళ్లను వల విసరటం ఒక అలవాటుగా చేసుకుంది.
తన ట్రాప్ లో పడిన మగాళ్లను రేప్ పేరుతో డబ్బులు గుంజటం.. వారిపై నకిలీ అత్యాచారం కేసులు పెట్టి వేధించటం లాంటివి చేసేది. తన మాటలకు భయపడిపోయి.. ఆమె అడిగినంత డబ్బులు ఇచ్చిన వారిని వదిలి.. తన బెదిరింపులకు లొంగని వారిపై అత్యాచారం కేసులు పెట్టేది. తాజాగా పెట్టిన 8 మంది మగాళ్లను విచారించిన పోలీసులు అసలు విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు.
దీంతో.. రేప్ జరగకున్నా.. అత్యాచారం జరిగిందంటూ నాటకం ఆడిన మాయలేడీని..ఆమెకు సహకారం అందిస్తున్న తల్లి..నరేంద్ర యాదవ్ అనే మరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించి ఎదురు కేసు పెట్టారు. హనీట్రాప్ విసిరి.. మగాళ్లకు చుక్కలు చూపించే ఈ కిలేడీని పోలీసులు అరెస్టు చేయగా.. ఆమె తల్లి.. నరేంద్రయాదవ్ మాత్రం తప్పించుకున్నారు.
ఇప్పుడు వారి కోసం పోలీసులు వెతుకులాట షురూ చేశారు. హనీట్రాప్ లేడీని కోర్టు ముందు హాజరుపరిచి.. జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. సో.. అత్యాశకు పోయి అడ్డంగా బుక్ కాకుండా మగమహారాజులు ఉండాల్సిన సమయం వచ్చేసింది.