'వైసీపీ' వి గాలి కబుర్లు .. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు !

Update: 2021-02-10 12:30 GMT
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో  తొలివిడత పోలింగ్ , లెక్కింపు చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిశాయి. పార్టీల గుర్తులపై అభ్యర్థులు నిలవకపోయినా ఆయా పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్థులే అన్ని చోట్ల పోటీలో నిలబడ్డారు. దీనితో పోటీ తీవ్రస్థాయిలో నడిచింది. ఇదిలా ఉంటే తొలివిడత ఫలితాలపై చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ పతనం  ఈ ఫలితాలతో ప్రారంభమైందని ,రాబోయే రోజుల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. 90 శాతానికి పైగా గెలవకపోతే మీ పదవులు పీకేస్తానని జగన్‌ టార్గెట్‌ పెట్టారని, వీటితో హింస చెలరేగిందన్నారు.

ఈ ఎన్నికల్లో మద్యం, కండబలంతో పాటు అన్నీ ఉపయోగించారని, ఇన్ని చేసినా ప్రజలు టీడీపీ ని నమ్మి వెంట నిలబెడ్డారని చంద్రబాబు ప్రశంసించారు. తాజాగా జరిగిన తొలిదశ ఎన్నికల ఫలితాల్లో 38 శాతం టీడీపీకి అనుకూలంగా వచ్చిందని చంద్రబాబు తెలిపారు. వాస్తవ పరిస్ధితి ఇలా ఉంటే 94 శాతం వైసీపీ గెల్చుకుందని మంత్రులు ఫేక్‌ లెక్కలు చెప్తూ , మాదే విజయం అని ప్రచారం చేసుకుంటున్నారు అని విమర్శలు కురిపించారు.

రాష్ట్రంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బలవంతపు ఏకగ్రీవాల కోసం తీవ్రంగా ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ బలవంతపు ఏకగ్రీవాలు చోటు చేసుకున్నాయో ఆయన లెక్కలతో సహా వివరించారు. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే విధానం ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లోనూ తప్పుడు ఫలితాలను ప్రకటించారని, అలాగే కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా ఏకగ్రీవాలు చేశారని ,ఎస్ ఈ సీ, హైకోర్టు సహా అందరికీ వీటిపై ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేస్తామన్నారు.

 పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు, మద్యం పట్టుబడితే కేసులు నమోదు చేసి అభ్యర్ధులను అనర్హుల్ని చేస్తామంటూ వైసీపీ సర్కారు ఓ నల్ల చట్టాన్ని తీసుకొచ్చిందని, కానీ దీంతో టీడీపీతో పాటు ఇతర విపక్షాల నాయకులను బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అంతేకాక టీడీపీ నేతల పై అక్రమ కేసులు పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Tags:    

Similar News