వాళ్లు చెప్పేది కాదు.. ఈ ఫోటోలు చూశాక నిజం మీకే తెలుస్తుంది

Update: 2021-10-05 09:30 GMT
ముక్కు మొహం తెలీని వారితో పరిచయం.. అది కాస్తా ప్రేమగా మారటం. అది కూడా ఎంతంటే.. అప్పటికే పెళ్లైన మొగుడ్ని వదిలేసి.. వదిలివెళ్లేంత. కట్టుకున్నోడిని మోసం చేసిన తర్వాత.. తాను మాత్రం మోసపోదా? ఇలాంటి ఉదంతాలు ఈ మధ్యన అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్న వారు సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనాలు ఈ మధ్యన ఎక్కువ అవుతుంది. అలాంటి కోవలోకే వస్తుందీ ఉదంతం.
యూపీలో వెలుగు చూసిన ఈ ఉదంతం చూస్తే.. చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత ఛండాలంగా మారిందనటానికి ఇదో ఉదాహరణగా చెప్పాలి. అతను యూపీలోని బాస్తీ మెడికల్ కాలేజీలో వైద్యుడిగా పని చేస్తుంటాడు. వయసు కూడా ఎక్కువే. తన కంటే చిన్నదైన ఒక అమ్మాయిని ఎలా పరిచయం చేసుకున్నాడో కానీ ఫేస్ బుక్ లో పరిచయం చేసుకున్నాడు. మామూలు చాటింగ్ కాస్తా.. చివరకు ఎక్కువై.. భర్తను వదిలేసి అతడి వద్దకువచ్చే వరకు వెళ్లిపోయింది.

తాను కలలు కన్న జీవితం తన కాళ్ల దగ్గరకు వచ్చినట్లుగా సంతోష పడింది. ఈ హడావుడిలో కాలం కరిగిపోయింది. కొద్దిరోజుల పాటు రాణిలా చూసుకుంటూ.. అటు ఇటు తిప్పిన డాక్టర్.. తర్వాత ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. ఇప్పుడామె చిన్న బాబుతో అతడి ఇంటి ఎదుట.. కూరగాయలు అమ్ముతూ నిరసన చేస్తోంది. ఈ ఉదంతానికి సంబంధించి బాధితురాలి వెర్షన్.. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడి వెర్షన్ విన్నప్పుడు.. ఇద్దరు చెప్పింది నిజమే అనిపిస్తుంది. కానీ.. వైద్యుడి వాదనకు భిన్నంగా కనిపించే ఫోటోల్ని చూసినంతనే.. అతగాడి మాటల్లో మాయ ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

ఫేస్ బుక్ లో చాటింగ్ తర్వాత భర్తను వదిలేసి వచ్చిన మహిళ.. సదరు వైద్యుడితో ఉంటోంది. వారికి ఒక బాబు కూడా కలిగాడు. ఇన్నాళ్లు కలిసి ఉన్నాం.. పిల్లాడు కూడా పుట్టాడు.. ఇకనైనా పెళ్లిచేసుకుందామని అడగటమే ఆమె చేసిన తప్పు. అంతే.. ఇంట్లో ఉండాల్సిన ఆమెవీధుల్లోకి వచ్చి పడింది. చిన్న పిల్లాడితోకలిసివీధుల్లో కూరగాయులు అమ్ముతోంది. తనకు న్యాయం జరుగుతుందని భావిస్తోంది.

మరి.. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ వెర్షన్ అందుకు భిన్నంగా ఉంది. కొంతకాలం క్రితం తన తల్లిని తీసుకొని తన వద్దకు వైద్యం కోసంవచ్చారని.. ఆ సందర్భంగా తాను ఎంత పేదరికంలో ఉన్న విషయాన్ని చెప్పి ఆదుకోవాలంటే.. తాను దయతలచి ఇంట్లో పని మనిషి ఉద్యోగాన్ని ఇచ్చానని.. తన మంచితనాన్ని బలహీనంగా చేసుకొని తన ఆస్తిని కొట్టేయాలని భావిస్తోందని అందుకే తాను ఉద్యోగంనుంచి తీసేసినట్లు చెప్పటం గమనార్హం. వైద్యుడు చెప్పినట్లుగా ఆమె పని మనిషి అయితే.. ఫోటోలో అంత క్లోజ్ గా.. పక్కన కూర్చోబెట్టుకుంటారా? అన్నది ప్రశ్న. ఈ ఫోటో చాలు.. అతగాడి మాటలకు.. చేతలకు మధ్య తేడా ఏమిటో.


Tags:    

Similar News