షర్మిల దీక్ష హిట్టా? ఫట్టా?

Update: 2021-04-16 12:33 GMT
తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయాలని వైఎస్ షర్మిల చేస్తున్న దీక్షను తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. పాదయాత్రగా వెళుతున్న షర్మిలను అరెస్ట్ కూడా చేశారు.  కరోనా వైరస్ విస్తృతి దృష్ట్యా ఆమెను అరెస్ట్ చేయాల్సి వచ్చింది.

వైఎస్ షర్మిలకు తెలంగాణ సర్కారు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుమతించింది. ఈ మేరకు ఆమె తనతోపాటు దీక్షకు హాజరు కావాలని తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు, మేధావులకు స్వయంగా లేఖలు రాశారు.

అయితే ఎన్నో లేఖలు రాసినా కేవలం బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య, ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాత్రమే షర్మిలకు మద్దతుగా వేదిక దగ్గర కనిపించారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్, ప్రజాసంఘాల నేతలు ఎవరూ మద్దతుగా కలిసి రాలేదు.

ప్రస్తుతం షర్మిల కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కోదండరాం, గద్దర్ సహా ప్రజా సంఘాలు టీఆర్ఎస్ సర్కార్ ను వ్యతిరేకిస్తున్నాయి. అయితే శత్రువులంతా కలిసి రావాల్సి ఉన్నా  ఒక్కరు కూడా షర్మిలకు మద్దతు పలకకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దీన్ని బట్టి షర్మిలను సీమాంధ్ర నేతగా ఇక్కడి నేతలు, ప్రజాసంఘాలు చూస్తున్నట్టు అర్థమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులు సీమాంధ్ర నేత షర్మిలతో కలవడానికి ఇష్టపడకనే వారంతా రాలేదని తెలుస్తోంది. దీన్ని బట్టి తెలంగాణలో షర్మిలకు మద్దతు కష్టమేనన్న వాదన వినిపిస్తోంది.
Tags:    

Similar News