చంద్రయాన్2 ఘనత: చంద్రుడి ఉపరితలంపై నీరు

Update: 2021-08-12 23:30 GMT
భారతదేశం ప్రయోగించిన చంద్రయాన్2 ఉప గ్రహం ప్రస్తుతం చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. కొన్ని ఫొటోలు వీడియోలు తీస్తూ చంద్రుడి ఉపరితలం జాడలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు అందిస్తోంది. తాజాగా చంద్రుడి ఉపరితలంపై నీటి అనుణువులను ఇస్రో చంద్రయాన్2 ఆర్బిటర్ గుర్తించింది. పరిశోధకులు ఆర్బిటర్ యొక్క ఇమేజింగ్ ఇన్ ఫ్రారెడ్ స్పెక్ట్రో మీటర్ ద్వారా పొందిన డేటాను విశ్లేషించగా ఈ అద్భుతం ఆవిష్కృతమైంది.

29 డిగ్రీల ఉత్తర , 62 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య చంద్రుడిపై హైడ్రేషన్, నీటి అణువులు స్పష్టంగా గుర్తించామని ఇస్రో సంచలన విషయాన్ని చెప్పుకొచ్చింది. చంద్రుడి ఉపరితలంపై సౌర గాలులు వీచినప్పుడు  హైడ్రాక్సిల్ అనే నీటి అణువులు ఏర్పడడాన్ని కూడా వివరించింది.

చంద్రుడి అధిక అక్షాంశాల వద్ద ప్రకాశవంతమైన సూర్యరశ్శి ఎత్తైన ప్రాంతాలలో నీటి అణువులను గుర్తించినట్టు ఇస్రో తెలిపింది. భవిష్యత్తులో నీటి వనరుల కోసం గ్రహాల అన్వేషణకు ఈ ఆవిష్కరణ చాలా ముఖ్యమైనదని ఇస్రో తెలిపింది.

రాబోయే కొన్నేళ్లు అనేక అంతర్జాతీయ మిషన్లు చంద్రుడిపై వరుసగా దిగబోతున్నాయి. చంద్రుడిపై నీటి అణువులు మనం పీల్చే ఆక్సిజన్ గా విరిగిపోతాయి కాబట్టి వ్యోమగాములు అంతరిక్ష సూట్ లను ధరించాల్సిన అవసరం భవిష్యత్తులో ఉండదని నిపుణులు చెబుతున్నారు.
Read more!

చంద్రుడిపై నీరు లేదా చంద్రుడి నేల నుంచి సృష్టించబడిన ఆక్సిజన్ ఖచ్చితంగా శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే చంద్రుడి చుట్టూ శ్వాసక్రియ వాతావరణాన్ని సృష్టించడం అనేది శతాబ్ధాల పని.. ఒక గ్రహం లేదా.. చంద్రుడి తరహా వాతావరణం ఏర్పడడానికి చాలా వాయువు అవసరం పడుతుంది. చంద్రుడి గురుత్వాకర్షణ తక్కువ కాబట్టి చంద్రుడి వాతావరణంలో ఆక్సిజన్ ఏర్పడడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది.

సంవత్సరం క్రితం అపోలో వ్యోమగాములు చంద్రుడి నుంచి తిరిగి తీసుకొచ్చిన కొన్ని రాళ్లలో చిన్న మొత్తంలో నీరు ఉన్నట్టు కనుగొన్నారు. ధ్రువాల దగ్గర ఉన్న ప్రాంతాలల ఉపరితల మంచు ఉంటుంది. ఎందుకంటే అక్కడ నేరుగా సూర్యకాంతి పడదు.

ఇప్పటికే అమెరికా ప్రయోగించిన రెండు ఉప గ్రహాలలో నీడ ఉన్న ప్రాంతాలలో ఉపరితలం నుంచి ఒక మీటరు ఎత్తులో నీటిమంచుతో కప్పబడి ఉన్నట్టు బలమైన సాక్ష్యాలను అందించింది. ఇప్పుడు భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 1 స్పెక్ట్రోమీటర్ ద్వారా చంద్రుడిపై నీటి జాడను మరోసారి ధ్రువపరిచారు.
Tags:    

Similar News