వైరల్ వీడియో : పెళ్లి విషయమై తాత, మనవరాలు మధ్య ఆసక్తికర సంభాషణ

Update: 2021-07-22 09:30 GMT
జాతీయ భద్రతా సమస్యల దృష్ట్యా టిక్ టాక్‌తో పాటు పలు యాప్‌లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ప్రజెంట్ జనాలు టిక్ టాక్ ఆల్టర్నేట్స్ పైన పట్టు సాధించారు. ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్, షేర్ చాట్ ఇంకా తదితర యాప్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. యువతీ యువకుల్లో చాలామంది హ్యాపీగా ఫ్రీ టైం ఎంజాయ్ చేయడం కోసమే అన్నట్లుగా ఈ యాప్‌లను వాడుతున్నారు. కొందరు మాత్రం తమలోని ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలని ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ భిన్నమైన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. నెట్టింట వైరల్ అవుతున్న సదరు వీడియోలో ఇంతకీ ఏముంది? ఎవరి మధ్య కన్వర్జేషన్స్ జరిగాయి? తెలియాలంటే ఈ కథనాన్ని మీరు పూర్తిగా చదవాల్సిందే.

సాధారణం ఫన్నీ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ ఉండే టిక్ టాక్ ఇతర వీడియోలు డిఫరెంట్‌గా ఉంటే వైరల్ అవుతుంటాయి. తాజాగా వైరలయ్యే వీడియోలో మాత్రం ఆసక్తికర సంభాషణలు జరిగాయి. ఓ తాత, మనవరాలు మధ్య జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండవుతోంది. మేగాన్ అనే ఓ అమ్మాయికి తన తాత ఫోన్‌లో చాటింగ్‌ చేస్తూ.. ఆమెకు చాలా సరదా సూచనలు చేశారు. పలు జాగ్రత్తలూ చెప్పారు. 91 ఏళ్ల వయస్సున్న ఆ గ్రాండ్ ఫాదర్ తన మనవరాలు మేగాన్‌కు 29 ఏళ్లలోపే లైఫ్ పార్ట్‌నర్ ఎంచుకోవాలని సూచించాడు. ఆ విషయమై తాను ఒక ఆర్టికల్ చదివినట్లు, ఇంకో మూడు నెలల్లో నీ బర్త్ డే వస్తుందని ఈ విషయం గుర్తుచేస్తున్నానని చెప్పాడు. ఫోన్‌లో పంపిన ఈ ఫన్నీ మెసేజ్ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read more!

ఈ టిక్ టాక్ సందేశంలో తాత మనవరాలకి పలు సూచనలు చేశాడు. తన కుటుంబ సభ్యులు గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని మరిచిపోవద్దని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే బరువు తగ్గాలని మేగాన్‌కు సూచించాడు తాత.
 
కాగా, పలు ఫన్నీ వ్యాఖ్యానాలూ చేశాడు చిలిపి తాతయ్య. మద్యం అధికంగా తాగొద్దని చమత్కారంగా సూచించాడు. లిక్కర్ ప్రైసెస్ హెవీగా ఉన్నాయన్న విషయం తాను న్యూస్ ద్వారా తెలుసుకున్నానని, కాబట్టి మద్యం ఎక్కుగా తీసుకోవద్దని చురకలంటించాడు. కాగా, ఈ సూచనలపై మనవరాలు మేగాన్‌ కూడా వెరీ ఫన్నీగా స్పందించారు. తాను ఎల్లప్పుడూ తన తాతను ప్రేమిస్తుంటానని రిప్లయి ఇచ్చింది. తన తాతతో జరిగిన ఈ సరదా సంభాషణలకు సంబంధించి మొబైల్‌ చాటింగ్‌ స్క్రీన్‌ షాట్లతో మేగాన్‌ టిక్‌టాక్‌ వీడియో రూపొందించింది. సదరు వీడియోను సోషల్ మీడియా వేదికగా అప్‌లోడ్ చేయగా, అది తెగ వైరలవుతోంది.

తాత, మనవరాలి వెరీ ఓపెన్ అండ్ ఫన్నీ సంభాషణలు చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వెరీ స్పోర్టివ్ అండ్ ఫ్రెండ్లీ తాతయ్య అని పోస్టులు పెడుతున్నారు. తాత, మనవరాలు అంటే ఇలా ఉండాలి అని, ఇది ఆదర్శ రిలేషన్ షిప్ అని మరికొందరు అంటున్నారు. ఇకపోతే మనవరాలితో మ్యారేజ్ విషయమై ఇలాంటి సూచనలు చేయగల గ్రాండ్ ఫాదర్ ఉండటం ఆ అమ్మాయి అదృష్టం అని కొందరు పేర్కొంటున్నారు. మొత్తంగా ఈ టిక్ టాక్ సరదా సంభాషణల వీడియో చూసి నెటిజనాలు హ్యాపీగా సరదా కామెంట్లు, చేస్తూ వీడియోను లైక్ చేస్తున్నారు.


Full View



Tags:    

Similar News