అంతర్జాతీయంగా అరుదైన పదవికి వెంకయ్య
తెలుగు నేల బిడ్డ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి ఆవాస పాలకమండలి అధ్యక్షుడిగా వెంకయ్యనాయుడు ఎన్నికయ్యారు. కెన్యాలో జరిగిన పాలకమండలి జనరల్ కౌన్సిల్ భేటీలో సభ్యులు వెంకయ్యనాయుడును ఎన్నుకున్నారు. వెంకయ్యనాయుడు రానున్న రెండు సంవత్సరాల కాలానికి సంబంధించి యుఎన్-హేబిటేట్ పాలకమండలి జరిపే చర్చోపచర్చలకు అధ్యక్షత వహిస్తారు. 1978లో యున్-హేబిటేట్ స్థాపన జరిగిన తరువాత భారతదేశం 1988లోను, 2007లోను రెండు పర్యాయాలు ఈ ముఖ్యమైనటువంటి సంస్థకు నాయకత్వం వహించేందుకు ఎన్నికైంది. మళ్ళీ ఇప్పుడు 3వ సారి భారతదేశానికి ఈ గౌరవం దక్కింది.
ప్రపంచవ్యాప్తంగా సామాజికంగాను, పర్యావరణ పరంగాను కొత్తగా ఏర్పడిన గ్రామాలను ప్రోత్సహించడం కోసం పని చేస్తున్న ఐక్యరాజ్య సమితి (యుఎన్ఒ)కు చెందిన విభాగమైనటువంటి యుఎన్- హేబిటేట్ అధ్యక్ష స్థానానికి భారతదేశం ఏకగ్రీవంగా ఎన్నికైంది. 10 సంవత్సరాల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. యున్–హేబిటేట్ తన నివేదికను ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు సమర్పిస్తూ ఉంటుంది. 58 సభ్యత్వ దేశాలతో కూడిన యున్–హేబిటేట్ పాలక మండలి ఈ రోజు నుంచి కెన్యాలోని నైరోబిలో 4 రోజులపాటు సమావేశం కానుంది. ఈ సమావేశానికి కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన, సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అధ్యక్షత వహిస్తారు.
అంతర్ ప్రభుత్వ విధాన రూపకల్పన మరియు నిర్ణయాలు చేసేటటువంటి విభాగంగా పేరు పొందిన యుఎన్-హేబిటేట్ పాలక మండలి మానవుల పునరావాసం తాలూకు సమగ్ర అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందజేస్తూ వస్తోంది. అంతేకాకుండా ఆయా గ్రామాల సమస్యలను పరిష్కరించడంలో సంబంధిత ప్రాంతాల మరియు దేశాలకు సహకరించడంతోపాటు, ఆయా దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తూ వస్తోంది. ఈ రోజు నుంచి వెంకయ్యనాయుడు అధ్యక్షతన సాగే పాలక మండలి 26వ సమావేశపు ఇతివృత్తంగా - “ఆపర్ట్యునిటీస్ ఆఫ్ ఇఫెక్టివ్ ఇప్లిమెంటేషన్ ఆఫ్ ది న్యూ అర్బన్ అజెండా’’ను ఎంపిక చేశారు. పాలకమండలి అధ్యక్ష స్థానానికి 2 సంవత్సరాల కాలానికి భారతదేశాన్ని ఎన్నుకొని ఇండియా పై విశ్వాసాన్ని వ్యక్తం చేసినందుకు సభ్యత్వ దేశాలకు వెంకయ్యనాయుడు ధన్యవాదాలు తెలిపారు.
యుఎన్ – హేబిటేట్ పాలక మండలిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. అభివృద్ధి చెందుతున్న దేశాలలో శరవేగంగా చోటుచేసుకొంటున్న పట్టణాభివృద్ధి నేపథ్యంలో జీవించే హక్కు యొక్క గౌరవాన్ని పరిరక్షించే విధంగా అర్బన్ ప్లానింగ్ వ్యూహాలకు కొత్త రూపం ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. అటల్ మిషన్ ఫర్ రిజూవెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ ఫార్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వంటి వివిధ నూతన కార్యక్రమాలతో భారత్ ముందుకు సాగుతోందని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా వివరించారు. వీటితోపాటు తక్కువ ఖర్చులో ఇళ్ళ నిర్మాణం, అవస్థాపనలో వేరు వేరు కోవలకు చెందిన లోటుపాటులను ఈ కార్యక్రమాలు పరిష్కరిస్తున్నాయని ఆయన అన్నారు.