వెరైటీ దొంగ .. నగ్నంగా తిరుగుతూ ..
కొన్నిరోజుల క్రితం దొంగతనం అంటే దొంగలకు పెద్ద టాస్క్. ఏదైనా కొట్టేయాలంటే ప్లాన్ చేసి పని పూర్తి చేసే దాకా విపరీతమైన టెన్షన్. దొంగతనం చేస్తూ ఎక్కడ దొరికిపోతామేమోనని భయం. వెళ్లిన చోట ఏదైనా విలువైన వస్తువులు దొరికితే బావుండనే ఆశ. ఇలా చాలా విషయాల్లో టెన్షన్ పడి అటెన్షన్ పాడవకుండా గుట్టు చప్పుడు లేకుండా దొంగతనం పూర్తి చేసేవారు. ఇదంతా పాతతరం దొంగల స్టైల్. ఇప్పుడు దొంగలు మారారు. దొంగతనం చేసే విధానం మారింది. తాజాగా విశాఖపట్నం లో వైరటీ దొంగ తెరపైకి వచ్చాడు. ఒంటిపై బట్టు లేకుండా దొంగతనాలకు పయనం అవుతున్నాడు..దొరికినకాడికి దోచుకుంటున్నాడు. ఈ వైరటీ దొంగ గారి వ్యవహారం సీసీ కెమెరా ఫుటేజ్ తో వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే .. మర్రిపాలెం వుడాకాలనీ ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఓ ఇంట్లోకి వెనుక గేటు నుంచి లోపలికి ప్రవేశించాడు. ఆ దొంగ ఒంటిపై బట్టలు లేకుండా ఇల్లంతా తిరిటాడు. ఈ సీన్ మొత్తం ఆ పక్కనే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇంట్లో బంగారు నగలు, వెండి సామగ్రి లేకపోవడంతో బీరువాలో ఉన్న రూ.15 వేలు తీసుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత మళ్లీ దొంగ ఆ ఏరియాలోనే మరో రెండు ఇళ్లల్లో ఇలాగే దొంగతనాలు చేసేందుకు ప్రయత్నించాడు.
కానీ, ఆ ఇంట్లో అణాపైసా కూడా చిక్కక పోవడంతో వెళ్లిపోయాడు. సీసీ కెమెరా ఫుటేజ్ గమనించిన ఇంటి యజమానులు.. ఈ వెరైటీ దొంగను చూసి షాక్ అయ్యారు. దీనితో స్థానికులంతా కలిసి ఎయిర్ పోర్ట్ జోన్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అలాగే, క్లూస్ టీం సిబ్బంది వేలిముద్రలు తీసుకున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా నగరంలో ఈ తరహా దొంగతనాలు ఎక్కువగా జరగడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.