షాకింగ్ గా వామన్ రావు ఆడియో టేపు.. అందులో ఏముంది?
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లాయర్ దంపతుల హత్య కేసులో తెలంగాణ అధికారపక్షం తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నది. అధికారపార్టీకి చెందిన నేతలే.. ఈ హత్య వెనుక ఉన్నారన్న విపక్షాల విమర్శకు ఇప్పటివరకు స్పష్టమైన కౌంటర్ ఇవ్వలేదు కేసీఆర్ సర్కారు. ఇదిలా ఉంటే.. లాయర్ వామన్ రావు.. కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబుతో మంచి రిలేషన్ ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారంలోనూ వాస్తవం లేదా? అన్న సందేహాలు వ్యక్తమయ్యే పరిస్థితి.
తాజాగా ఒక ఆడియో క్లిప్ వైరల్ గా మారింది. అందులోని మాటలు దారుణ హత్యకు గురైన లాయర్ వామన్ రావు మాటల్ని పోలి ఉన్నట్లు చెబుతున్నారు. మరో వ్యక్తితో మాట్లాడిన ఈ సందర్భంలో వామన్ రావు తన ఆవేదనను పంచుకున్నట్లుగా కనిపిస్తోంది. శ్రీధర్ బాబు తనను అవమానపర్చాడని.. నీతి లేని వ్యక్తి అని వేరే వ్యక్తితో వామన్ రావు చెప్పినట్లుగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ తండ్రి శ్రీపాదరావు కుటుంబంతో తాను ఇరవై ఏళ్లుగా దూరంగా ఉన్నానని.. ఇంటికి వచ్చి శరణు కోరితే తాను సపోర్టు చేసినట్లుగా ఆ టేపులో ఉంది. ఈసారి తానేమిటో చూపిస్తానని.. తాను పోటీ చేస్తే ఇబ్బంది అవుతుందని శ్రీధర్ బాబు శరణు కోరటంతో తాను పోటీ నుంచి తప్పుకున్నట్లుగా అందులో ఉంది. ఒక విధంగా శ్రీధర్ బాబు ఎమ్మెల్యే పదవి తన భిక్షగా పేర్కొన్నారు. ఆయన అనుభవిస్తున్న పదవి తాను పెట్టిన భిక్ష అని.. తన మాదిరి బాధితులు ఎంతో మంది ఉన్నారని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో పుట్టా మధు.. శ్రీధర్ బాబు బాధితులు ఎందరో ఉన్నారని.. వారంతా వామన్ రావుకు అండగా ఉంటారని మరో వ్యక్తి అన్న వ్యాఖ్యలకు లాయర్ వామన్ రావు సానుకూలంగా స్పందించినట్లుగా ఆ ఆడియో క్లిప్ లో ఉంది. వైరల్ గా మారిన ఈ ఆడియో క్లిప్ లోని అంశాల్లో వాస్తవం ఎంత? ఏమిటన్న వివరాలు లెక్క తేలాల్సి ఉంది.