తొలిదశలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్​.. ఎవరెవరికంటే..!

Update: 2020-12-15 05:49 GMT
కరోనా వ్యాక్సిన్​ కోసం యావత్​ప్రపంచం వేయికళ్లతో ఎదురుచూస్తున్నది. ఇప్పటికే బ్రిటన్​, అమెరికా దేశాల్లో వ్యాక్సిన్​కు అనుమతి వచ్చింది. త్వరలోనే టీకాలు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారత్​ లో కూడా వ్యాక్సిన్​ పంపిణీకి రంగం సిద్ధమవుతున్నది. వ్యాక్సినేషన్​ ప్రక్రియ ఎలా జరగబోతుంది. తొలిదశలో ఎవరికి ఇస్తారా? తదితర విషయాలపై కేంద్రప్రభుత్వం గైడ్​లైన్స్​ (మార్గదర్శకాలు) జారీ చేసింది. వీటి ప్రకారం.. ఆయా రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్​ ఇస్తారు. ఒకవైళ సైడ్​ఎఫెక్ట్స్​ వస్తే వైద్యసిబ్బంది ఎలా ఎదుర్కొవాలి. ముందుగా ఎవరికివ్వాలి తదితర విషయాలపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది.  

డిజిటల్​ ప్లాట్​ఫాం అయిన కొవిడ్​ వ్యాక్సిన్​ ఇంటెలిజెన్స్​ నెట్​వర్క్​ (CO-WIN) ద్వారా లబ్ధిదారులు, టీకాల వివరాలను ట్రాక్​ చేయనున్నారు. వ్యాక్సినేషన్​ ప్రక్రియపై వైద్యసిబ్బందికి ట్రైనింగ్​ ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో మొత్తం 23 మంత్రిత్వ శాఖలను భాగస్వాములను చేశారు. వారంతా ఎలా సమన్వయం చేసుకోవాలో గైడ్​లైన్స్​లో వివరించారు. అయితే ప్రస్తుతం పోలింగ్​బూత్​లు ఎలాగైతే ఏర్పాటు చేస్తున్నారో.. అలాగే ప్రతి గ్రామంలో ప్రతి బూత్​లో వ్యాక్సినేషన్​ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇలా చేయడం వల్ల ప్రజలు గుంపులుగా ఒకేచోట చేరే అవకాశం ఉండదని కేంద్ర యోచిస్తున్నది. ఫేజ్-1 వ్యాక్సినేషన్ లో మొత్తం దాదాపు 30కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

మొదట హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 50 ఏళ్లు పైబడినవారికి అంతకంటే తక్కువ వయసువారు ఉండి ఇతర రోగాలతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇస్తారు. అయితే ఓటర్​కార్డు ఆధారంగా వయసును నిర్ధారించనున్నారు. ప్రభుత్వం ఉచితంగానే వ్యాక్సినేషన్​ ఇస్తుందా? లేక నామమాత్రపు ఫీజు వసూలు చేస్తుందా అన్న విషయంపై ఇప్పటికయితే క్లారిటీ లేదు. బిహార్ ఎన్నికల ముందు తాము గెలిస్తే ఉచితంగా వ్యాక్సిన్​ ఇస్తామని అప్పట్లో బీజేపీ హామీ ఇచ్చింది. దీంతో ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తాయి. ఒక్క బిహార్​లో ఇస్తే మిగతారాష్ట్రాల పరిస్థితి ఏమిటని విపక్షాలు ప్రశ్నించాయి. దీంతో అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే పంపిణీ చేస్తామని కేంద్రం చూచాయగా చెప్పింది కానీ స్పష్టత నివ్వలేదు.
Tags:    

Similar News