వివాదాస్పదమైన యూఎస్ సీ ట్వీట్

Update: 2019-01-01 09:12 GMT
సోషల్ మీడియా వేదికగా యూఎస్ సీ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. అగ్రరాజ్య అణ్వాయుధాగారాన్ని పర్యవేక్షించే అమెరికా స్ట్రాటజిక్ కమాండ్(యూఎస్ సీ) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసింది. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్త సంవత్సరం పెద్ద బాల్ ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నామని - అవసరమైతే అంతకంతకూ దాని పరిధి పెరుగుతూనే ఉంటుందని పేర్కొంది. దీన్ని చదివిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కొత్త సంవత్సరం వేళ బాంబుల గురించి, పేలుడు గురించి హెచ్చరికలు చెబుతారా అంటూ యూఎస్ సీ పై మండిపడుతున్నారు.

‘కొత్తగా ఆలోచిస్తామన్న ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా..? అని నెటిజన్లు యూఎస్ సీ తీరుపై  ప్రశ్నించారు. ఆయన కొత్త ఆలోచనలు ఇవేనా. ఏం మనుషులు..? వెంటనే క్షమాపణ చెప్పాల్సిందేనని నిలదీశారు. బాంబులు పేలుస్తామని అమెరికన్లందరినీ భయాందోళనకు గురిచేస్తారా అని మండిపడ్డారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారు’ అని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

నెటిజన్ల ఆగ్రహాన్ని గుర్తించిన యూఎస్ సీ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. కొత్త ఏడాది సందర్భంగా పాత్ ట్వీట్ చేసినందుకు చింతిస్తున్నామని వెల్లడించింది. ‘ మా విలువలు, స్తాయికి తగినట్టుగా లేవు. క్షమించండి’ అనే పేర్కొంది. చివరగా అమెరికాతోపాటు మిత్ర దేశాల భద్రత పర్యవేక్షించడమే తమ పనిగా పేర్కొంటూ మళ్లీ ట్వీట్ చేసింది. అప్పడుగానీ నెట్ జన్ల ఆగ్రహం కొంత చల్లారలేదు.



Full View
Tags:    

Similar News