ఫెయిల్ అయ్యారన్న చోట కూడా ట్రంప్ కే ఓట్లు వేశారే?

Update: 2020-11-07 14:00 GMT
రోటీన్ కు భిన్నమైన సీన్ ఒకటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోచోటు చేసుకుంది. ఈసారి ఎన్నికల్లో కరోనా అంశం ప్రధానంగా మారిన వైనం తెలిసిందే. ఈ మహమ్మారిని అడ్డుకోవటంలోనూ.. విస్తరించకుండా చేయటంలో అధ్యక్షుడు ట్రంప్ ఫెయిల్ అయ్యారన్న విమర్శలు భారీగా వెల్లువెత్తటం తెలిసిందే. చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా.. ఒక ఇష్యూలో అమెరికన్లు ఇంత భారీగా మరణించటం ఇదే తొలిసారన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం ట్రంప్ అన్న ఆరోపణ ఉంది.

మహమ్మారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండి ఉంటే.. కరోనాకు అమెరికా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన అవసరం ఉండేది కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. కరోనా విపరీతంగా వ్యాప్తి చెందిన అమెరికాలోని పలు ప్రాంతాల్లో గెలుపు ట్రంప్ పక్షాన ఉండటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా.. కరోనా బాధితులు ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తారని.. కరోనా భాదిత ప్రాంతాల్లో బైడెన్ కు తిరుగులేని అధిక్యత లభిస్తుందన్న అంచనాలకు విరుద్ధంగా ఫలితం ఉండటం విశేషం.

కరోనా అధికంగా వ్యాప్తిచెందిన ప్రాంతాల్లో ట్రంప్ విజయం సాధించినట్లుగా గుర్తించారు. ఈ వాదనకు నిదర్శనంగా డకోటా.. మొంటానా.. నెబ్రస్కా.. విస్కాన్సిన్.. అయోవా రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలన్నీ ఆయన పరమైనట్లుగా చెబుతున్నారు. కరోనా ఎపిసోడ్ లో ట్రంప్ ఏమీ చేయలేకపోయారన్న వాదనను ప్రపంచం మొత్తం నమ్మితే.. ఆశ్చర్యకరంగా కరోనా ప్రభావానికి గురైన అమెరికన్లు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం గమనార్హం.
Tags:    

Similar News