ఇప్పటికైతే.. చరిత్రలో నిలిచిపోయే రికార్డును క్రియేట్ చేసిన బైడెన్

Update: 2020-11-05 06:15 GMT
ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఏం చెప్పాయి? ఎవరు గెలిచారు? లాంటి సాధారణ ప్రశ్నలకు సమాధానం చెప్పటం ఇప్పుడు ఇబ్బందిగా మారింది. కారణం.. కౌంటింగ్ సాగుతున్న తీరు.. వెల్లడవుతున్న ఫలితాలు గంట గంటకు ఫలితాలు మారేలా చేస్తున్నాయి. బుధవారం నాడు చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటివరకు ఎవరు నమోదు చేయలేని ఒక రికార్డును డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ క్రియేట్ చేశారని చెప్పాలి.

అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఏ అధ్యక్ష అభ్యర్థికి రానన్ని ఓట్లు బైడెన్ సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు అత్యధిక ఓట్లను సొంతం చేసుకున్న అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పేరుతో రికార్డు ఉంది. ఆయన 2008లో 6.94 కోట్ల ఓట్లను సొంతం చేసుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.10 గంటల సమయానికి జో బైడెన్ ఆల్ టైం రికార్డును క్రియేట్ చేస్తే.. 6.99 కోట్ల ఓట్లను సొంతం చేసుకోగా.. ఆయనకు ప్రత్యర్థిగా నిలిచిన ట్రంప్ నకు 6.68 కోట్ల ఓట్లను సొంతం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లను చూస్తే.. ట్రంప్ కంటే కాస్త మెరుగైన పరిస్థితుల్లో బైడెన్ ఉన్నారు. కీలకమైన ఆరు రాష్ట్రాల్లో వచ్చే ఓట్లు తుది నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా ఉన్నాయి. ఇదంతా చూస్తే.. గెలుపు ఎవరి వశమవుతుందన్న విషయంపై క్లారిటీ రానప్పటికీ.. అత్యధిక ఓట్లను సొంతం చేసుకున్న అభ్యర్థిగా మాత్రం జో బైడెన్ విజయం సాధించారనే చెప్పాలి.
Tags:    

Similar News