అమెరికా ముస్లింలు బిడెన్​ వైపే.. కారణం ఏమిటంటే..!

Update: 2020-11-05 03:15 GMT
ఈ దఫా అమెరికా ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రిపబ్లికన్​ పార్టీ అభ్యర్థి ట్రంప్​.. మరికొన్నిరాష్ట్రాల్లో డెమొక్రాట్ల అభ్యర్థి జో బిడెన్​ ఆధిక్యం సాధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం బిడెన్​ ఆధిక్యం కొనసాగుతున్నది. కొన్ని రాష్ట్రాల్లో నిన్న రాత్రి వరకు పోలింగ్​ కొనసాగుతుండటంతో ఫలితాలు ఆలస్యమవుతున్నాయి. ప్రస్తుతం ట్రెండ్​ను పరిశీలిస్తే జో బిడెన్‌కు 264 ఎలక్టోరల్ ఓట్లు పోలవగా, ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు పోలయ్యాయి. ఇంకో నాలుగు ఎలక్ట్రోరల్ ఓట్లు వస్తే జో బిడెన్​ విజయం సాధిస్తారు. అయితే ఈ సారి ముస్లింలు ఎవరి పక్షాన నిలిచారన్న విషయం ఆసక్తికరంగా మారింది.

అమెరికా మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. జో బిడెన్​కు 69 శాతంమంది ముస్లింలు ఓట్లు వేసినట్టు సమాచారం.  ఈ విషయాన్ని ది కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్(సీఏఐఆర్) వెల్లడించింది. 17 శాతం అమెరికన్ ముస్లింలు ట్రంప్‌కు మద్దతుగా నిలిచినట్లు తెలిపింది. గత ఎన్నికలతో పోలిస్తే.. ట్రంప్‌కు అమెరికన్ ముస్లింల మద్దతు కాస్తంత పెరగడం విశేషం. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 13 శాతం మంది ముస్లింలు ట్రంప్‌కు మద్దతుగా నిలవగా.. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్లో 17 శాతం మంది మద్దతు తెలిపినట్లు సీఏఐఆర్ తెలిపింది. ట్రంప్​ ఆది నుంచి ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆయనపై ముస్లింలు ఓట్లు వేయన్నట్టు సమాచారం. మరోవైపు నల్లజాతీయులు కూడా ట్రంప్​ను తీవ్రంగా వ్యతిరేకించారు. ట్రంప్​ హయాంలో నల్లజాతీయులపై జరిగిన వరుసదాడులే ఇందుకు కారణం.
Tags:    

Similar News