ట్రంప్ నిషేధం: భారత్ కు భారం.. చైనాకు వరం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశంలోకి విదేశీ నిపుణులు ఉద్యోగాల కోసం రాకుండా వీసాలను నిలిపివేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికాలో ప్రజలు హర్షం వ్యక్తం చేయగా.. కార్పొరేట్ కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు అని ఆడిపోసుకున్నాయి.
ప్రధానంగా ట్రంప్ వీసాల నిషేధం భారత్ కు పెద్ద దెబ్బగా పరిగణించింది. ఎందుకంటే వీసాల్లో 70శాతం మన ఐటీ, ప్రొఫెషనల్స్ హెచ్1బీ వీసాలే ఉన్నాయి. వాటిపై ఆంక్షలతో భారత ప్రొఫెషనల్స్ కు అమెరికాలోకి వెళ్లకుండా ఆటంకం కలిగింది.
అదే సమయంలో ట్రంప్ నిపుణుల నిషేధం చైనాకు వరంలా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా పత్రికలు కూడా వీసాల నిషేధం చైనాకు మాత్రమే ఉపకరిస్తుందని విశ్లేషించాయి. సింథటిక్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, బయోటెక్ రంగాల్లో చైనా నైఫుణ్యం కలిగిందని.. అమెరికన్లకు అస్సలు వాటిల్లో ప్రావీణ్యం లేదని.. కాబట్టి అత్యంత నైపుణ్యం కలిగిన చైనా వారే ఆ ఉద్యోగాల్లో పాతుకుపోతారని ట్రంప్ నిర్ణయంతో హువాయి, బైదు, టెన్సెంట్ వంటి చైనా కంపెనీలకు మేలు చేకూరుతుందని అమెరికా ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది. నిపుణులైన మేనేజర్ల కొరత ఉంటే ఈ ఉద్యోగాలను కార్పొరేట్ కంపెనీలన్నీ విదేశాలకు తరలిస్తాయని.. తద్వారా అమెరికన్లకు ఉద్యోగావకాశాలు రావని తెలిపింది.
ఇక భారతీయ హెచ్1 బీ వీసాదారులకు ట్రంప్ వీసాల నిషేధంతో ఇప్పుడు కలవరపడుతున్నారు. ఇప్పటికే కరోనా భయంతో భారత్ కు వచ్చిన వారు తమను అమెరికాలో అడుగుపెట్టేందుకు అమనుతించాలని అమెరికన్ అధికారులను కోరుతున్నారు. ఇక హెచ్1 బీ ముగిసిన వారు కూడా భారత్ బాట పట్టేందుకు రెడీ అయ్యారు. సో ఈ పరిణామం ఐటీ కాకుండా వేరే రంగాల్లో అత్యంత నిపుణులైన చైనా వారికి వరంగా మారగా.. ఐటీనే నమ్ముకున్న భారతీయులకు శాపంగా మారిందంటున్నారు.