ఆర్జీవీ 2.0.. జాన్ మెకాఫే!

Update: 2021-06-27 01:30 GMT
వివాదాస్ప‌ద వ్య‌క్తి అన‌గానే మ‌న‌కు గుర్తొచ్చే వ్య‌క్తుల్లో ఖ‌చ్చితంగా ఆర్జీవీ ముందు వ‌ర‌స‌లో ఉంటాడు. త‌న‌ని తాను సెల్ఫ్ సెంట‌ర్డ్ అని ప్ర‌క‌టించుకోవ‌డం మొద‌లు.. అమ్మాయిల‌ను ఆరాధించ‌డం.. సాహ‌సాల‌కు కేరాఫ్ గా నిల‌వ‌డం వంటివెన్నో మ‌నం రామ్ గోపాల్ వ‌ర్మ నుంచి చూశాం. అయితే.. ఆర్జీవీని అప్ గ్రేడెడ్ వ‌ర్ష‌న్ లో చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? జాన్ మెకాఫేలా ఉంటాడు! ఇత‌నెవ‌రు అంటున‌కుంటున్నారా? చెప్పడానికి చాలా ఉంది. కాస్త సూక్ష్మంగానే ఆయ‌న బ‌యోగ్ర‌ఫీ చూసేద్దాం..

మీకు కంప్యూట‌ర్ గురించి తెలుసా? కంప్యూటర్లో వాడే యాంటీ వైరస్ గురించి తెలుసా? ఇది తెలిస్తే.. ఈ జాన్ మెకాఫే గురించి తెలిసిన‌ట్టే. ‘మేకాఫే’ అనే ప్రసిద్ధమైన యాంటీ వైర‌స్ ఉంటుంది. ఇప్పుడు కూడా ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు వంద కోట్ల మంది దీన్ని వాడుతున్నారు. దాన్ని త‌యారు చేసింది ఈయ‌నే. బ్రిట‌న్లో పుట్టిన మెకాఫే.. అమెరికా పౌరుడిగానూ కొన‌సాగారు. ఈయ‌న లైఫ్ యాంబిష‌న్ ను సింగిల్ లైన్ లో చెప్పాలంటే. ‘ప్ర‌తి నిమిషం ఆస్వాదించాలి’. అంతేకాదు.. అందులో తప్పకుండా కిక్కుండాలని అంటాడు. చివరి వరకు అదే పద్థతిని అనుసరించాడు మెకాఫే.

నిత్యం అమ్మాయిల సేవలో తరించేవాడు. డ్రగ్స్ తీసుకునేవాడు. తుపాకులు కూడా పట్టుకు తిరిగాడు. ఇత‌ను కూడా దేవుడు లేడ‌ని చెప్పాడు. నిత్యం వివాదాల‌తోనే స‌హ‌వాసం చేశారు. నిత్యం ఇదే ప‌ద్ధ‌తిలో జీవితం కొన‌సాగించిన మెకాఫే.. సాహ‌సం లేక‌పోతే తాను బ‌త‌క‌లేన‌ని చెప్పేవాడు. అందుకేనేమో.. కావాల‌నే వివాదాల్లోకి దూరిపోయేవాడు.

1987లో ప్ర‌పంచంలోనే తొలి యాంటీవైర‌స్ రూపొందించాడు మెకాఫే. కంప్యూట‌ర్ ఈయ‌న‌కు పిల్ల‌లు ఆడుకునే వీడియో గేమ్ తో స‌మానం. ఆ విధంగా.. రూపొందించిన సాఫ్ట్ వేర్ తో పేరు ప్ర‌ఖ్యాతుల‌తోపాటు ఊహకంద‌నంత సొమ్ము కూడా సంపాదించాడు. ఆర్జీవీ మాదిరిగానే ఈయ‌న ట్వీట్లు సంచ‌ల‌నంగా ఉండేవి. అది అర్థంకానివాళ్లంతా వివాదాస్ప‌దం చేసేస్తారు క‌దా. ఈయ‌న కూడా వివాదాస్ప‌దుడ‌య్యాడు.

ఇక‌, డ్ర‌గ్స్ తీసుకోవ‌డాన్ని నేరంగా ప‌రిగ‌ణించాల్సిన అవ‌స‌రం లేదు. సైజు త‌గ్గించి ప్ర‌భుత్వ‌మే అందించాల‌న్నాడు. హింస చేయ‌నివారిని జైల్లో బంధించడం స‌రికాద‌న్నాడు. ప‌లు కార‌ణాల‌తో అమెరికాకు దాదాపు ఎనిమిది సంవ‌త్స‌రాల పాటు ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌లేదు. దీంతో.. ఇత‌న్ని ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. స‌ముద్రంలోకి పారిపోయాడు. ఒక ఖ‌రీదైన షిప్పులో మెకాఫే, భార్య న‌లుగురు గార్డ్స్ విత్ గ‌న్స్‌. ఓ నాలుగు కుక్క పిల్ల‌లు. ఇదే అత‌ని ప్ర‌పంచం. ఒకానొక ద‌శ‌లో అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వికి సైతం రెండు సార్లు పోటీప‌డ‌డం గ‌మ‌నించాల్సిన అంశం.

2007లో ఆర్థిక సంక్షోభంలో స‌ర్వం పోగొట్టుకున్నాడు. ప్ర‌భుత్వం తో ఏర్ప‌డిన ఆదాయ ప‌న్ను వివాదంలో ఆస్తుల‌న్నీ పోయాయి. ఈ క్ర‌మంలోనే ఇస్తాంబుల్ పారిపోయేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. బార్సిలోనా విమానాశ్ర‌యంలో ప‌ట్టుబ‌డి జైల్లో మ‌గ్గిపోయాడు. అయితే.. తాజాగా ప‌న్ను ఎగ్గొట్టిన కేసులో అమెరికాకు మెకాఫేను అప్ప‌గించ‌డానికి అనుమ‌తి ఇస్తూ స్పెయిన్ కోర్టు ఆదేశాలిచ్చిన కాసేప‌టికే జైల్లో చ‌నిపోయాడు మెకాఫే. ఇది జ‌రిగి మూడు రోజుల‌వుతోంది.

జీవితాంతం ‘లివ్ ఇన్ డేంజ‌ర‌స్‌’ అనే పద్ధతిలో బతికిన మెకాఫే.. తన జీవితంలో అధిక భాగం స్త్రీలకే కేటాయించాడు. ఆ విధంగా ఆయన 48 మంది పిల్లలకు జన్మనిచ్చిన‌ట్టు ఓ లెక్క‌. ఈ లెక్క కూడా ఎవ‌రో వేసింది కాదు.. మేకాఫే అనౌన్స్ చేసిందే. ఇంకా.. ఆయ‌న జీవితంలో ఎన్నో ఊహించ‌ని ఘ‌ట‌న‌లు ఉన్నాయి. అన్నీ సాహ‌సాల‌తో కొన‌సాగిన‌వే. అమెరికాకు ప‌ట్టుబ‌డితే.. జీవితం మొత్తం జైలు గోడ‌ల మ‌ధ్య‌నే ఉండాల్సి వ‌స్తుంద‌ని.. కావాల‌నే త‌నువు చాలించాడు. ఇప్పుడు ఆయ‌న వ‌య‌సు 75 సంవ‌త్స‌రాలు.
Tags:    

Similar News