నిమ్మగడ్డకు ఊహించని షాక్.. ఈ యాంగిల్ అస్సలు ఆలోచించి ఉండరు

Update: 2020-12-13 03:17 GMT
ఎంత పవర్ ఫుల్ ప్లేస్ అయినా.. దానికంటూ కొన్ని పరిమితులు ఉంటాయన్నది మర్చిపోకూడదు. తన హద్దుల్ని దాటేసే ఎవరికైనా తిప్పలు తప్పవు. ఈ చిన్న విషయాన్ని మర్చిపోయిన ఏపీ ఎన్నికల కమిషనర్ కు తాజాగా దిమ్మ తిరిగిపోయే షాక్ తగిలింది. ఏది ఏమైనా.. ఎవరు అవునన్నా.. కాదన్నా తప్పనిసరిగా స్థానిక ఎన్నికల్ని నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికల్ని నిర్వహించే విషయంలో ఏపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు.

దీంతో.. సర్కారు వర్సెస్ ఎన్నికల కమిషనర్ అన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో.. ఎన్నికల నిర్వహణకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు నిమ్మగడ్డ. ఇలాంటి వేళ.. ఆయనే మాత్రం ఊహించని రీతిలో దిమ్మ తిరిగే షాక్ తగిలింది. స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థలఎన్నికలకు ఏ మాత్రం సరైన సమయం కాదన్నారు.

ఈ ఇష్యూ మీద ఎన్నికల కమిషనర్ మరోసారి ఆలోచించాలన్నారు. అంతేకాదు.. కరోనాకు బలి అయిన వారిలో ఎక్కువ మంది రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు ఎన్నికల్ని వాయిదా వేయాలి కోరారు. ఎన్నికల్ని ఏదోలా నిర్వహించాలన్న లక్ష్యంతో ఉన్న నిమ్మగడ్డ.. తాజాగా ఎదురైన ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సవాల్ ను ఏ రీతిలో అధిగమిస్తారో చూడాలి.
Tags:    

Similar News