డోపింగ్ రాయుళ్లకు షాక్.. పతకాలు ఇచ్చేయాలంటూ ఆదేశం
ఏ క్రీడకు సంబంధించి అయినా ఆటగాళ్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించడం సర్వ సాధారణమే. ఆటలు మొదలయ్యే ముందు కానీ లేదా ఆటలు ముగిసిన తర్వాత కానీ కచ్చితం గా డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆటగాళ్లు పక్క దారి పట్టి మోసాలకు పాల్పడకుండా కుండా ఉండేందుకు ఆయా క్రీడా బోర్డులు తరచుగా డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తుంటాయి. ఒకవేళ పరీక్షల్లో విఫలం అయితే తగిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. బోర్డులు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఆటగాళ్లు గతి తప్పు తూనే ఉంటారు. తాజాగా డోపింగ్ పరీక్షల్లో దొరికి పోయిన రెజర్లు వెంటనే తమ పతకాలను వెనక్కి ఇవ్వాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఆదేశించింది. డోపింగ్ కు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల కేంద్ర క్రీడాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో డబ్ల్యూఎఫ్‌ఐ కఠినచర్యలు తీసుకుంది.
గత నాలుగు ఖేలో ఇండియా గేమ్స్ లో పతకాలు సాధించిన 12 మంది రెజ్లర్లు డోపింగ్ పరీక్షలో విఫలమయ్యారు. వారికి గతంలో ప్రభుత్వం ఇచ్చిన పతకాలు - ప్రశాంస పత్రాలను వెంటనే వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు శనివారం డబ్ల్యూఎఫ్‌ఐ కార్యదర్శి వినోద్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
డోపింగ్ పరీక్షలో దొరికిపోయిన వారిలో రోహిత్ దహియా -మనోజ్ - కపిల్ - అభిమన్యు - వికాస్ కుమార్ - విశాల్ - జగదీశ్ - రోహిత్ - విరాజ్ - వివేక్ - జస్ దీప్ సింగ్ - రాహుల్ కుమార్ ఉన్నారు. వీరి పేర్లను సూచిస్తూ ఆయా రాష్ట్ర సంఘాలను ఇందులో భాగం కావాల్సిందిగా డబ్ల్యూఎఫ్‌ఐ ఆదేశించింది.