వారం వ్యవధిలో హైదరాబాద్ లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి.. కారణం తెలుసా ఈటెల?
తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదన్న మాటను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ తరచూ చెబుతుంటారు. ముందుచూపుతో వాయుసేన వారి యుద్ధ విమానంలో ఆక్సిజన్ వాహనాల్ని ఒడిశాకు పంపినట్లు చెబుతారు. ఆయన మాటలే నిజమైతే.. హైదరాబాద్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఇద్దరు వారం వ్యవధిలో ఆక్సిజన్ అందక మరణించకుండా ఉండాల్సింది. కానీ.. వారిద్దరూ సకాలంలో ఆక్సిజన్ అందక మరణించారు. అది కూడా.. ఐదారు ఆసుపత్రులు తిరిగి.. ఎక్కడా ఆక్సిజన్ లేదని చెప్పిన పిమ్మట.. చేసేదేమీ లేక ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వారు మృత్యువాత పడటం గమనార్హం.
విన్నంతనే అయ్యో అనిపించే ఈ ఉదంతంలోకి వెలితే.. సికింద్రాబాద్ సీతాఫల్ మండి బ్రాహ్మణ బస్తీకి చెందిన శేషాచార్యులకు ముగ్గురు అబ్బాయిలు.. ఐదుగురు అమ్మాయిలు. మూడో కుమార్తె అనిత (48) భర్తతో బెంగళూరులో ఉంటుంది. ఈ నెల 21న బెంగళూరు నుంచి తల్లిగారింటికి వచ్చింది. 22న శ్వాస తీసుకోవటంలో సమస్య తలెత్తటంతో అంబులెన్సులో ఆసుపత్రికి వెళ్లింది. ఐదు ఆసుపత్రులకు వెళ్లినా ఆక్సిజన్ సమస్య లేని కారణంగా ఆమెను ఆడ్మిట్ చేసుకోలేదు.
చివరకు ఎల్ బీనగర్ ఓజోన్ ఆసుపత్రిలో ఆక్సిజన్.. బెడ్లు ఉన్నాయని తెలిసి అక్కడకు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. అనిత అక్క కల్యాణి (51) మియాపూర్ లో ఉంటారు. ఈ నెల 16న స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కరోనా టెస్టులో నెగిటవ్ వచ్చింది.. సాయంత్రం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటం.. పలు ఆసుపత్రులకు తిరిగినా ఖాళీ బెడ్లు లేవని చెప్పటంతో ఇంటికి వెళ్లారు.
అదే రాత్రి ఆమె మరణించారు. ఇద్దరు శ్వాస సంబంధ సమస్యతోనే ఆసుపత్రుల్లో చేరేందుకు ప్రయత్నించటం.. ఇద్దరు వారం వ్యవధిలో మృత్యువాత పడటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు.. తెలంగాణ రాష్ట్రం మొత్తం పరిస్థితిని పక్కన పెడితే.. హైదరాబాద్ మహానగరంలో ఆసుపత్రుల్లో బెడ్లు లేకపోవటం.. ఆక్సిజన్ కొరత రెండు ప్రాణాలు పోయేలా చేయశాయన్నది మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా.. ఆక్సిజన్ సమస్య లేదని మంత్రి ఈటెల చెప్పగలరా? ఆయనకు వీరి మరణాల గురించి తెలిసి ఉండకపోవచ్చు. లేకుంటే.. ఆయన కొరత లేదనే మాటలు చెప్పి ఉండేవారు కాదేమో?