బ్రేకింగ్: మంత్రి ఎర్రబెల్లి కారు బోల్తా ఇద్దరు మృతి

Update: 2019-11-24 04:41 GMT
తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ లోని ఓ కారు బోల్తా పడింది. జనగామ జిల్లా లింగాల ఘనపురం, మండలం చిటూరు వద్ద అదుపుతప్పి  ప్రమాదానికి గురైంది. మంత్రి కారు వెనుకాల ఉన్న ఈ కారే ప్రమాదం బారిన పడింది.

ఎర్రబెల్లి శనివారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్ నుంచి పాలకుర్తి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన కారు ముందే ఎర్రబెల్లి కారు ఉంది. కొంచెం అటూ ఇటూ అయినా ఈయన కారు పై పడి పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. తృటి లో ఎర్రబెల్లి యాక్సిడెంట్ ను తప్పించుకున్నారు.

ఈ యాక్సిడెంట్ లో కారు డ్రైవర్ పార్థసారథి, సోషల్ మీడియా ఇన్ చార్జి పూర్ణ మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రం గా గాయపడ్డారు. గన్ మెన్ నరేష్, పీఏ శివ, అటెండర్ తాతారావులను ఎర్రబెల్లి స్వయం గా జనగామ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి వారికి చికిత్సను దగ్గరుండి అందిస్తున్నారు.
Tags:    

Similar News