అమెరికా అధ్యక్షుడికి మరోసారి ట్విట్టర్ షాక్
ట్రంప్ కు ట్విట్టర్ మరోసారి షాక్ ఇచ్చింది. తాజాగా ట్రంప్ రీ ట్వీట్ చేసిన ట్వీట్ ను ట్విట్టర్ తొలగించింది. ట్రంప్ రీ ట్వీట్ చేసిన ట్వీట్ లో తప్పుడు సమాచారం ఉన్నందువల్లే అలా చేయాల్సి వచ్చిందని ట్విట్టర్ వివరణ ఇచ్చింది. కరోనా కారణంగా మరణించిన వారిలో కేవలం ఆరు శాతం మంది మాత్రమే వ్యాధి కారణంగా మరణించారని.. మిగతా 94 శాతం మంది వివిధ వ్యాధుల బారినపడి మృతి చెందినట్లు సీడీసీ డేటాను అప్ లోడ్ చేసినట్లు ట్రంప్ మద్దతుదారుడైన ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. అయితే వాస్తవానికి సీడీసీ అప్లోడ్ చేసిన విషయం వేరే.
కరోనా బారిన పడి మరణించిన వారిలో 6 శాతం మందికి జారీచేసిన మరణ ధ్రువీకరణ పత్రాల్లో మరణానికి కారణం కరోనా మాత్రమేనని ప్రస్తావించింది.మిగిలిన 94 శాతం మంది కి అందజేసిన ధ్రువ పత్రాల్లో కరోనాతో పాటు ఇతర కారణాలను కూడా చేర్చింది. అయితే ఈ వివరాలు మారేలా ట్రంప్ మద్దతుదారుడు ట్వీట్ చేయగా..దానిని ట్రంప్ రీ ట్వీట్ చేశారు. వాస్తవ సమాచారం మారిపోవడంతో ట్విట్టర్ ఆ ట్వీట్ ను తొలగించింది. ఇప్పటికే పలుమార్లు డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లను ట్విట్టర్ డిలీట్ చేసింది. అలా చేసిన ప్రతి సారి ఏదో ఒక కారణం చెబుతోంది. ఇప్పుడు మరోసారి ట్రంప్ ట్వీట్ ను ట్విట్టర్ తొలగించడం సంచలనంగా మారింది. ఇటీవల తప్పుడు సమాచారం తొలగింపుపై ట్విట్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అందుకే అగ్ర రాజ్య అధిపతి తప్పు చేసినా ట్విట్టర్ ఈ విషయంలో రాజీ అవలేదు.