టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ బదిలీ ..కొత్త ఈవో ఎవరంటే ..!

Update: 2020-02-26 06:30 GMT
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ..అధికారం లోకి వచ్చినప్పటినుండి పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ , రాష్ట్రంలో ఎక్కడా అవినీతి అనేది లేకుండా పాలన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు కీలకమైన శాఖల ప్రధాన అధికారులని బదిలీ చేసిన జగన్ సర్కార్ కన్ను ఇప్పుడు టీటీడీ పై పడినట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీటీడీ ఈవో గా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్‌ అతి త్వరలో బదిలీ చేసే అవకాశం ఉంది. అయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీవత్స కృష్ణను టిటిడి కొత్త ఈవోగా తీసుకువచ్చే అవకాశం ఉంది.

కర్ణాటక క్యాడర్ కి చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శ్రీవత్స కృష్ణ , ప్రస్తుతం జాయింట్ సెక్రటరీగా కేంద్ర డిప్యుటేషన్‌ లో ఉన్నారు. ఏప్రిల్ నాటికి ఈయన డిప్యుటేషన్ సమయం ముగియనుంది. దీనితో కేంద్రం తో మాట్లాడి .. కేంద్రంలో ఆయన డిప్యుటేషన్ టైం ముగియగానే, ఏపీకి డిప్యుటేషన్ పై తీసుకోని వచ్చి టీటీడీ ఈవో పదవిలో కూర్చోబెట్టాలని జగన్ సర్కార్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే , శ్రీవత్స కృష్ణ IAS ట్రైనింగ్ లో గోల్డ్ మెడలిస్ట్. అలాగే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి MBA చేసిన మొదటి IAS అధికారి , దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చిన గ్లోబల్ లీడర్స్ ఫర్ టుమారో యొక్క ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్న మొదటి భారత కెరీర్ బ్యూరోక్రాట్.

ఈయన తన ఐఏఎస్ కెరియర్ ని ఢిల్లీలోని యూనియన్ టెరిటరీ లో ప్రారంభించారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ కేడర్ లోకి వచ్చిన ఈయన , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇ-గవర్నెన్స్ కార్యక్రమాల బృందం లో ప్రధాన పాత్ర వహించారు. ఈ IAS అధికారి గతంలో ప్రపంచ బ్యాంక్, నాస్డాక్, ది కాన్ఫరెన్స్ బోర్డ్ మరియు USAID లకు కన్సల్టింగ్ పనులను కూడా చేశారు. ఇకపోతే ఈయన భార్య గుంజన్ కృష్ణ, కూడా 2004-బ్యాచ్ , మహారాష్ట్ర క్యాడర్ కి చెందిన IAS ఆఫీసర్. ఈమెని కూడా త్వరలో డిప్యూటేషన్‌ పై ఏపీకి తీసుకోని వచ్చి కీలకమైన బాధ్యతని అప్పగించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News