కాంగ్రెస్, బీజేపీల గాలి తీసిన కేటీఆర్

Update: 2022-04-26 12:30 GMT
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంలోని బీజేపీపై విరుచుకుపడ్డారు. ఇక పనిలో పనిగా కాంగ్రెస్ ను ఉతికి ఆరేశారు.దేశంలో జాతీయ పార్టీయే లేదని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీ అని.. కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైందన్నారు.

సోమవారం ఒక మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ప్రతి రాజకీయ పార్టీ తమ అజెండాను ప్రజల ముందుంచాలని సూచించారు. అప్పుడే ఏ పార్టీ స్థాయి ఏంటో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.

‘దేశంలో జాతీయ పార్టీయే లేదని నా అభిప్రాయం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతిపార్టీ మరో పార్టీతో లేదా వ్యూహకర్తతో కలిసి పనిచేస్తోందన్నారు. ప్రశాంత్ కిషోర్ ను కలవడం ఇదే మొదటిసారి కాదు.. ఐదేళ్లలో చాలా సార్లు కలిశాం.. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియా చెబుతోంది. కానీ ఆయనేమీ ఇంకా స్పష్టం చేయలేదన్నారు. మా పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేం కూడా ప్రశాంత్ కిషోర్ ను కలిశామన్నారు.

18-35 ఏళ్ల యువతరాన్ని ఎలా చేరుకోవాలనే అంశంపై దృష్టిపెట్టామని.. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న తర్వాత కొన్ని సార్లు నిష్పాక్షికమైన అభిప్రాయం అవసరమన్నారు.

కాంగ్రెస్ తో మాకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.  కాంగ్రెస్ అనవసరమైన సంస్థ. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించే అవకాశం ఇచ్చారు. నా అభిప్రాయం ప్రకారం.. కాంగ్రెస్ దుమ్ము పట్టుకుపోయింది. దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి దేశ స్థాయిని తగ్గించాయి అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదని ఇటీవల కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ  వల్ల లబ్ధి పొందడమేనని.. రిటర్న్ ఇచ్చిన దాఖలాలు లేవని కేటీఆర్ మండిపడ్డారు.

పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు గత ఏడేళ్లలో కేంద్రానికి రూ.3,66,000 కోట్లు చెల్లించగా, అధికార మార్పిడి ద్వారా మనకు కేంద్రం నుంచి రూ.1,68,000 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. మిగిలిన రూ. 2,00,000 కోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేసి ఉండవచ్చు అని ఆయన ప్రశ్నించారు. భారతదేశానికి తెలంగాణ గర్వకారణంగా నిలుస్తోందని, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నాలుగో అతిపెద్ద సహకారం అందించిన రాష్ట్రం అని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజల చెమట, రక్తాన్ని దేశవ్యాప్తంగా ఇతర అవసరాలకు వినియోగిస్తుంటే బాగుండేదని, అయితే రాష్ట్రాన్ని కేంద్రం నడుపుతోందని చెబితే ప్రజలకు చిరాకు వస్తుందని ప్రశ్నించారు. ‘తెలంగాణ మీకు ఇస్తోంది కానీ మీరు తెలంగాణకు ఏమీ తిరిగి ఇవ్వడం లేదు’ అని ఆయన అన్నారు.
Tags:    

Similar News