సచివాలయం ఖ్యాతి దేశవ్యాప్తమయ్యేలా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ భారీ ప్లాన్..
జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల నిర్వహించిన ఖమ్మం సభలో పేర్కొన్నారు. ఈ సభకు మూడు రాష్ట్రాల సీఎంలను ఆహ్వనించి సంచలనం సృష్టించారు. దీంతో కేసీఆర్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇదే తరుణంలో మరోసారి జాతీయ రాజకీయాల్లో తన ముద్ర వేసేందుకు భారీ ప్లాన్ వేస్తున్నారు. తెలంగాణలో నిర్మిస్తున్న సచివాలయం ఖ్యాతిని దేశమంతా తెలిపేందుకు ఈ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని 4 రాష్ట్రాల సీఎంలు, మరికొంత మంది మాజీ సీఎంలను ఆహ్వానించనున్నారు. సచివాలయం నిర్మాణం ద్వారా తన పవరేంటో చూపించేందుకు ప్రయత్నించనున్నారు. అలాగే జాతీయ మీడియాకు సైతం భారీస్థాయిలో ప్రకటనలు ఇచ్చే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 17న కేసీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా కొత్త సెక్రటేరియట్ ను ప్రారంభించనున్నారు. దాదాపు 13 వేల కోట్లతో నిర్మించిన సచివాలయం పనులు ఆ తేదీలోగా పూర్తి చేయాలని కేసీఆర్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. మధ్య మధ్యలో పనులను పర్యవేక్షిస్తూ మంత్రులను అలర్ట్ చేశారు. దీంతో మంత్రులు, ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఫిబ్రవరి 17లోగా సెక్రటేరియట్ ను రెడీ చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమంపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగేలా కేసీఆర్ భారీ ప్లాన్ వేస్తున్నారు. దీంతో జాతీయ రాజకీయాల్లో తన గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ఇందుకోసం కేసీఆర్ దేశంలోని నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వనించనున్నారు. కేసీఆర్ కు మద్దతు ఇచ్చే తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయ్, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్ లను పిలుస్తున్నారు. అలాగే మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ లకు కూడా ఆహ్వానం పంపనున్నారు. ఇక ఈ విషయం దేశ మంతా విస్తరించేలా జాతీయ మీడియాకు భారీగా ప్రకటనలు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తన గురించి దేశ మంతా చర్చించుకుంటారని అంటున్నారు. ఇదిలా ఉండగా పక్క రాష్ట్రం ఏపీ సీఎం జగన్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది.
కేంద్రంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకుండా మూడో కూటమి ఏర్పాటుకు కేసీఆర్ విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే కొన్ని సార్లు కాంగ్రెస్ కూటమి నాయకులతో.. మరోసారి కాంగ్రేసేతర పార్టీలతో కలిసి వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎవరితో పొత్తు ఉంటుందనేది అయోమయంగానే ఉంది. కానీ అప్పటి వరకు తనకు పబ్లిసిటీ వచ్చేలా కేసీఆర్ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాన సచివాలయానం ప్రారంభ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులా నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే ఖమ్మంలో నిర్వహించిన సభతో తమ వైపు కొన్ని పార్టీలు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అయితే ఈ సభకు బీహార్, బెంగాల్, తమిళ నాడు నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఎన్నికల నాటికి ఎటువంటి పరిస్థితులు మారినా కేసీఆర్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగేల భారీ స్కెచ్ లు వేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా దేశ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇక లోకల్ మీడియా కంటే జాతీయ మీడియాకు భారీగా ప్రకటనలు ఇవ్వడం ద్వారా తన పబ్లిసిటీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారు. అందుకే సచివాలయం ప్రారంభ కార్యక్రమం దేశప్రజలకు అవసరం లేకున్నా.. దానిని ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నారు.