'వర్క్ ఫ్రం హోం' ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా .. జర జాగ్రత !

Update: 2020-12-13 00:30 GMT
కరోనా మహమ్మారి అందరి జీవితాలని మార్చేసింది. కరోనా రాకముందు ఎలా ఉండేవాళ్లం , ఇప్పుడు ఎలా ఉండేవాళ్లం అని చెప్పుకునే పరిస్థితులు వచ్చాయి అంటే పరిస్థితి ఎంతలా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు కూడా శ్రమిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ను పూర్తి చేసుకొని , వ్యాక్సినేషన్ స్టేజ్ కి చేరుకుంటున్నాయి. ఈ వ్యాక్సినేషన్ అనేది పూర్తిగా అందుబాటులోకి వస్తే తప్ప ,మళ్లీ పాత రోజులు రావు. దీంతో దేశంలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్  ను ఇచ్చేశాయి. చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఈ ఏడాది మార్చి నెల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించేలా ప్రణాళికలు వేసుకుంటున్నాయి.

అయితే కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునే వాళ్లు సైతం మారిన పరిస్థితుల దృష్ట్యా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యొగాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మోసగాళ్లు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం వెతుకుతున్న వాళ్లను టార్గెట్ చేసుకుని కొత్తరకం మోసాలకు తెర లేపుతున్నారు.  డేటా ఎంట్రీ చేస్తే చాలు డబ్బులు చెల్లిస్తామని.. పది రోజుల్లో 100 పేజీలు ఎంట్రీ చేయాల్సి ఉంటుందని పలు కంపెనీలు ప్రకటనలు ఇస్తున్నాయి. సైబరాబాద్ పోలీసులు ఒక వ్యక్తి ఇలా ఫేక్ ప్రకటనల ద్వారా నిరుద్యోగులు, విద్యార్థుల నుంచి ఏకంగా 25 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు గుర్తించారు.

వేల సంఖ్యలో నిరుద్యోగులు, విద్యార్థులు అతని చేతిలో మోసపోయారు. ఆ వ్యక్తి ఒక్కొక్కరి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో 1000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు వసూలు చేశాదు. 5 బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసి నిరుద్యోగులు పంపే డబ్బును ఆ బ్యాంక్ అకౌంట్ లో జమ అయ్యేలా చేసుకున్నాడు. డబ్బు జమ చేసిన వారిలో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. కాబట్టి  వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అనగానే నమ్మకండి , నమ్మి డబ్బులు వృధా చేసుకోకండి.
Tags:    

Similar News