గత ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించారా? అదెలా జరిగింది?
వినటానికి విచిత్రంగా ఉన్నా.. ఇది వాస్తవం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష రేసులోకి దిగిన ట్రంప్.. ఓటమికి దగ్గర్లో ఉన్నట్లుగా ఫలితాలు చెబుతుంటే.. అదేమీ కాదు.. ఆఖరి ఓవర్లోస్వింగ్ స్టేట్స్ లో కొట్టే సిక్సర్ తో భారీ విజయం తమదే అన్న ధీమాలో ట్రంప్.. ఆయన వర్గీయులు ఉన్నారు. ఇందులో నిజం ఉందా? అంటే ఉందనే చెప్పాలి. అయితే.. ఆఖరి ఓవర్లో.. ఆఖరి బంతికి సిక్సర్ కొట్టొచ్చు.. కొట్ట లేకపోవచ్చు. కచ్ఛితంగా కొట్టే అవకాశం నూటికి నూరు శాతం లేకపోవచ్చు. ఈ అనిశ్చితి ఇప్పటికి కొనసాగుతోంది. ఫలితాలు వెల్లడి కావాల్సిన 5 రాష్ట్రాల్లో ఒకట్రెండు రాష్ట్రాల్లో ఫలితాలు వచ్చేసి.. అందులో బైడెన్ కు అవసరమైన ఆరు ఎలక్టోరల్ ఓట్లు వచ్చేస్తే.. మిగిలిన రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు లాంఛనమే అవుతుంది తప్ప.. దాని మీద ఎవరికి పెద్ద ఆసక్తి ఉండదు.
హేతుబద్ధంగా చూస్తే.. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ఆధారంగా డెమొక్రాట్ల అభ్యర్థి బైడెన్ కు గెలుపు అవకాశాలు 95 శాతం ఉన్నాయని చెప్పాలి. ఇప్పటివరకు సాగిన ఆయన అధిక్యం.. చివర్లో కలిసి రాకపోతే.. గెలుపు వాకిట్లోకి వచ్చి కూడా ఓటమి పాలు కావాల్సి ఉంటుంది. అదే జరిగితే.. అంతకు మించిన బ్యాడ్ లక్ మరొకటి ఉండదని చెప్పాలి. తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో విశేషం కూడా ఉంది. ఓడటానికి ఎక్కువ అవకాశం ఉన్న ట్రంప్.. తాను అధ్యక్షుడిగా గెలవటానికి సాధించిన ఓట్ల కంటే.. ఈసారి ఎక్కువ ఓట్లు సాధించినప్పటికీ ఓటమికి దగ్గరగా ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.
గత ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా వచ్చిన ఓట్లతో పోలిస్తే.. ఈసారి ఎన్నికల్లో ఆయన 40 లక్షల ఓట్లు అధికంగా సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు (భారత కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి వరకు) ఆయన 6.68 కోట్ల ఓట్లను సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల కంటే 40 లక్షల ఓట్లు అధికం. ఇంకా లెక్కించాల్సి ఓట్లు లక్షల్లో ఉన్నాయి. అయినప్పటికి ఆయన ఓటమికి దగ్గరగా ఉండటానికి కారణం ఏమంటే.. 120 ఏళ్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ నమోదు కానంత భారీగా పోలింగ్ జరగటమేనని చెప్పాలి. ఈ కారణంతోనే.. తాను అధ్యక్షుడిగా ఎన్నికనప్పుడు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లను సొంతం చేసుకున్నప్పటికీ ఓటమి దిశగా ట్రంప్ పయనిస్తున్నారు. ఇంతకంటే బ్యాడ్ లక్ మరొకటి ఉండదేమో కదూ?