ఆ టీఆరెస్ ఎమ్మెల్యే వరద బాధితుడు

Update: 2016-09-26 07:02 GMT
వరద, వరద నష్టం, ప్రజల కష్టం అన్నిటినీ లైట్ గా తీసుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీకే చెందిన ఎమ్మెల్యేయే స్వయంగా వరద నీటిలో చిక్కుకుపోయారు. దీంతో ఆయన్ను పోలీసులు జేసీబీ సహాయంతో బయటకు తేగలిగారు.

నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల్లో వరదనీటికి దెబ్బతిన్న పంటలను పరిశీలించి వస్తున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వాహనం కామారెడ్డిలో నిజాంసాగర్ చౌరస్తాలో భారీ వరదనీటి ప్రవాహంలో చిక్కుకు పోయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు  జెసిబి వాహనంతో ఎమ్మెల్యేను వరదనీటి నుండి దాటించి ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి చేర్చారు.

శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌లోకి ఎగువ ప్రాంతం నుండి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు ప్రాజెక్టుకు చెందిన 42 వరదగేట్లను ఎత్తి మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేస్తుండడంతో నిజామాబాద్ జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి.  టీఆరెస్ ఎమ్మెల్యే వరద నీటిలో చిక్కుకున్న తరువాతయినా కేసీఆర్ కు పరిస్థితి తీవ్రత అర్తమవుతుందో లేదో చూడాలి.
Tags:    

Similar News