తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలపై ఎప్పుడు? మళ్లీ ఆపేశారా?

Update: 2023-01-28 13:01 GMT
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు చేసిందని చెప్పుకుంటున్నారు. నిర్ణీత సమయానికి లేదా ముందస్తు ఎన్నికలకు వెళ్లినా వీరే పనిచేస్తారు. కొన్ని చోట్లు బీఆర్ఎస్ తనకు అనుకూలంగా ఐపీఎస్ లను బదిలీ చేసిందని ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ శాతం నాన్ ఐపీఎస్ లకే కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో వీరు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ ల బదిలీలుకూడా ఉంటాయని జోరుగా చర్చ సాగుతోంది. కానీ ప్రస్తుతానికి ఆ అవకాశం లేదని తెలుస్తోంది. అందుకు కారణం లేకపోలేదు.

గత నవంబర్ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఐఏఎస్ ల బదిలీలు ఉంటాయని అన్నారు. అందుకోసం సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో లిస్టును కూడా రెడీ చేశారు. కానీ ఆ సమయంలో ఓటర్ల లిస్టును సవరించాలన్న కారణంతో ఐఏఎస్ ల బదిలీలను ఆపేశారు.

ఆ తరువాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇటీవల ఐపీఎస్ లను భారీస్థాయిలో స్థాన చలనం చేయడం ద్వారా ఐఏఎస్ లను కూడా మరుస్తాని అనుకున్నారు. కానీ ఇప్పుడు కూడా ఆ అవకాశం లేదని తెలుస్తోంది. మరి కొంత కాలం ఐఏఎస్ ల బదిలీలు ఉండకపోవచ్చని అంటున్నారు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆంధ్రాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి నియమితులయ్యారు.అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అధికారులపై ఆమెకు అవగాహన లేదు.

వారి పనితీరును తెలుసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. అందువల్ల టైం తీసుకొని బదిలీ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా ఉండడంతో ఇప్పుడు బదిలీ విషయాన్ని పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.

ఐఏఎస్ అధికారుల బదిలీలు రెండేళ్లుగా సాగడం లేదు. అంతకుముందు కూడా కొందరికి మాత్రమే స్థానం చలనం కల్పించారు. ఈ నేపథ్యంలో ఎక్కువ రోజులు ఒకే చోట పనిచేసిన వారు స్థానం చలనం కోసం ఆర్జీలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో రాజకీయ విభేదాలతో పాటు పని ఒత్తిడి తీవ్రం కావడంతో బదిలీ కోరుతున్నట్లు సమాచారం. మరోవైపు ఇంతకాలం సోమేశ్ కుమార్ నేతృత్వంలో ఇబ్బందులు పడ్డవారు ఇప్పుడు శాంతి కుమారి నేతృత్వంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశపడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News