కాకినాడలో విషవాయువు కలకలం .. పలువురికి అస్వస్థత !
తూర్పుగోదావరి జిల్లాలో విష వాయువు లీకేజీ స్థానికంగా కలకలం సృష్టించింది. కాకినాడ లోని ఆటోనగర్ శివారులో విషవాయువుల కారణంగా తీవ్ర దుర్గంధం వెలువడడంతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు.ఆ దుర్వాసనకి వెంటనే స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కొందరు లారీ డ్రైవర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పరిశ్రమలశాఖ అధికారులు నమూనాలు సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. కాగా, లీకైన వాయువును ప్రమాదకరమైన అమోనియాగా అధికారులు గుర్తించారు.
దీనితో అధికారులు వెంటనే ఫైరింజన్లకి సమాచారం ఇచ్చి, అక్కడికి రప్పించారు. ఆ ఫైరింజన్లు ఘటన స్థలంలో నీరు చల్లడంతో వాయువు వాసన తీవ్రత తగ్గింది. కాకినాడ ఆటోనగర్ శివారులో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన 10 రసాయన సీసాల నుంచి విష వాయువులు వెలువడ్డాయి. అయితే , ఆ వ్యక్తులు ఎవరు , అక్కడ ఎందుకు వదిలి వెళ్లారనే అంశంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆ విషవాయువు తీవ్రత 200 మీటర్ల వరకు వ్యాపించింది. ఇప్పుడే కాదు మే 31వ తేదీన కూడా సర్పవరంలో వాయువులు లీకయ్యాయి.