ప్రపంచ ధనవంతుల్లో మనం మూడో స్థానం
ఆర్థిక మాంద్యం, తగ్గుతున్న జీడీపీతో భారత దేశం కుదేలవుతుంటే... భారత వ్యాపారవేత్తలు మాత్రం అపరకుబేరులు అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. భారత్ లో కుబేరుల సంఖ్య ఏటేటా జోరుగా పెరుగుతుండడం విశేషం.
గత ఏడాది సగటున ప్రతి నెలలో ముగ్గురు బిలియనీర్లు ఆవిర్భవించారు. కానీ ఈ ఏడాది ఏకంగా 34మంది కొత్త బిలియనీర్లు జతకావడం విశేషం. దేశంలో బిలియనీర్ల సంఖ్య ఏడాది కాలంలో 138కి ఎగబాకింది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే బిలియనీర్లలో భారత దేశం మూడో స్థానంలో నిలిచిందని హురున్ గ్లోబల్ రిచ్ 2020 జాబితా వెల్లడించింది. వీరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు.
ముఖేష్ అంబానీ సంపద విలువ ఏకంగా 6700 కోట్ల డాలర్లుకు చేరడం విశేషం. ఈయన గంటకు సంపాదించే మొత్తం ఎంత తెలుసా? ఏకంగా 7 కోట్లు. గంటకు 7కోట్లు సంపాదించే కుబేరుడు ముఖేష్ అంబానీ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా కుబేరుల్లో ముఖేష్ అంబానీ ఏకంగా 9వ స్థానంలో నిలవడం భారత్ కు గర్వకారణమన్నారు. ప్రపంచంలోనే ఇప్పుడు అమెజాన్ చీఫ్ జెఫ్ బోజెస్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ 14000 కోట్ల డాలర్లు గా ఉంది.
భారత్ , అమెరికాలో ఉన్న సంపన్నుల కన్నా చైనాలోనే అధిక సంపన్నులు ఉన్నారు. ఈ ఏడాదిలో ఇంకా ఎక్కువ మంది ఆ దేశంలో బిలియనీర్లుగా మారే అవకాశం ఉంది. చైనా 799 మంది బిలియనీర్లతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండగా.. అమెరికా 626 బిలియనీర్లతో రెండో స్థానంలో ఉంది.
హురున్ రిచ్ లిస్ట్ ఈ అపర కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2817 మందికి స్థానం లభించింది. ఇక అతిపిన్న సంపన్నుడు ఓయో వ్యవస్థాపకుడు రితేజ్ అగర్వాల్. ఈయన 24 ఏళ్లకే 110 కోట్ల డాలర్ల సంపాదనగా ఉంది.