ట‌ర్కీ రోడ్ల‌పై గొర్రెల క‌వాతు..ఆశ్చ‌ర్యంలో మునిగిన ప్ర‌జ‌లు

Update: 2020-05-05 23:30 GMT
క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌డౌన్ స‌మాజానికి ఎంతో మేలు చేస్తోంది. లాక్‌డౌన్ వ‌ల‌న వాతావ‌ర‌ణ కాలుష్యం త‌గ్గిపోయింది. రోడ్ల‌న్నీ ఖాళీగా ఉన్నాయి. వాహ‌నాలు లేక బోసిపోయిన రోడ్ల‌పై ప‌శువులు, జంతువులు స్వేచ్ఛ‌గా విహ‌రిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ట‌ర్కీ దేశంలా రోడ్ల‌పై వింత జ‌రిగింది. వంద‌ల సంఖ్య‌లో రోడ్ల‌పైకి గొర్రెలు వ‌చ్చాయి. క‌వాతు చేసిన‌ట్టు గుంపులుగుంపులుగా గొర్రెలు రోడ్ల‌పై వెళ్లాయి. దీన్ని చూసిన ట‌ర్కీవాసులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఎన్న‌డు లేన‌ట్టు రోడ్ల‌పైకి వ‌చ్చిన వాటిని చూసి ఆస‌క్తిగా గ‌మ‌నించారు.

ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో రోడ్ల‌పై మ‌నుషుల క‌న్నా జంతువులు విహ‌రిస్తున్నాయి. ఈ విధంగానే ట‌ర్కీలో లాక్‌డౌన్ విధించ‌డంతో ఆ దేశంలోని నగరాలు, పట్టణాలు బోసిపోయాయి. నగర వీధుల్లో గుండా వేలసంఖ్యలో టర్కీ గొర్రెలు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఆక‌ట్టుకుంటున్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. ఒక్కసారిగా రోడ్డుమీదకు వేల సంఖ్యలో గొర్రెలు రోడ్డు మీదకు వ‌చ్చాయి. ఒక దాని వెంట ఒక‌టి వెళ్తూ మొత్తం రోడ్డంతా తెల్ల రంగుతో నిండిపోయింది. ఈ రోడ్లు మావంటూ సామూహిక ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించాయి.
Tags:    

Similar News