ఈ కఫుల్ గుర్తున్నారా? వీరి.. లవ్ జర్నీ అలా మొదలైందట

Update: 2020-12-04 10:30 GMT
ఈ జంటను ఇప్పటికే గుర్తు పట్టి ఉంటారు. టీమిండియా జెర్సీతో అతడు.. ఆసీస్ జెర్సీతో ఆమె. ఎవరికి వారు వారివారి దేశాల గెలుపును కోరుకుంటూ మ్యాచ్ చూస్తున్నారు. అంతలో సీన్ మారి.. భారత్ కుర్రాడు.. ఆసీస్ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయటం.. ఆమె ఆనందంతో ఓకే అనటంతో ఒక్కసారి వాతావరణం మారింది. వీరి లవ్ ట్రాక్ ను కెమేరా కంటికి చిక్కటం.. అది కాస్తా రిలే కావటంతో ఒక్కసారిగా ఫేమ్ లోకి వచ్చిందీ జంట.

అప్పటివరకు సాదాసీదా అయిన ఇప్పుడు అందరికి గుర్తుండిపోయారు. టీమిండియా - ఆసిస్ మధ్య జరిగిన రెండో వన్డేలో స్టాండ్స్ లో కూర్చున్న ఈ స్నేహితులు.. మ్యాచ్ ముగిసే సమయానికి లవ్ కఫుల్ గా మారిపోవటం తెలిసిందే. ఓవైపు మ్యాచ్ జరుగుతున్న వేళ.. తన ప్రేమను వ్యక్తం చేయటం.. సినిమాటిక్ గా మోకాళ్లపై నిలబడి.. లవ్ ప్రపోజ్ చేస్తే.. ఆనందంతో ఓకే చెప్పిన వైనం టీవీ లైవ్ లో అందరికి కనిపించటమే కాదు.. తర్వాతి రోజు మీడియాలో ప్రముఖంగా పబ్లిష్ అయ్యింది. స్టాండ్స్ లో తన ప్రేమను చెబుతున్న వీడియోవైరల్ గా మారింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అయిన  సంగతి తెలిసిందే.

ఇంతకీ.. ఈ కపుల్ పేర్లేమిటి? వారిద్దరు తొలిసారి ఎలా కలిశారు? వారి స్నేహం ప్రేమగా మారిన వైనం.. స్టాండ్స్ లో అలా ప్రపోజ్ చేయాలని అతగాడు ముందే అనుకున్నాడా? లాంటి వివరాల్ని దీపేన్ మండాలియా స్వయంగా వెల్లడించారు. లవ్ ప్రపోజ్ చేసిన వ్యక్తి భారతీయుడైన దీపేన్. ఆ అమ్మాయి పేరు రోసిలీ విమ్ బుష్. రెండేళ్ల క్రితం అంటే.. 2018లో దీపేన్.. మెల్ బోర్న్ లోని ఒక అపార్ట్ మెంట్ లోకి వచ్చాడు.

అందులో అంతకు ముందు రొసిలీ ఉండేది. అయితే.. ఒక రోజు ఆమె పేరు మీద ఒక ఉత్తరం వచ్చింది. తర్వాత మరికొన్ని వచ్చాయి. దీంతో.. ఆమె నెంబరును తెలుసుకొని.. ఆమెకు ఆ విషయాన్ని చెప్పాడు. ఆమె తన అడ్రెస్ చెప్పటంతో.. ఆమెకు వచ్చిన మొయిల్స్ ఇచ్చేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అలా మొదలైన వారి పరిచయం.. తర్వాత స్నేహితులుగా మారారు. అలా వారిద్దరు కలిసి మ్యాచ్ కు వచ్చిన వేళ.. తన మనసులోని మాటను చెప్పేందుకు స్టేడియం చక్కటి ప్లేస్ గా దీపేన్ ఫీల్ అయ్యాడు. మ్యాచ్ ముందు.. పెళ్లికి ప్రపోజ్ చేయాలని ముందుగానే అనుకున్న అతడు.. మ్యాచ్ మధ్యలో ప్రపోజ్ చేయటం.. అందుకు రోసిలీ ఓకే చెప్పటం చాలా ఆనందంగా ఉన్నట్లు చెప్పాడు. అదండి వారి లవ్ స్టోరీ.
Tags:    

Similar News