మూడు రాజధానులపై జగన్ ఇచ్చిన ట్విస్ట్ ఇదే...!
ఏపీ సీఎం జగన్.. తాజాగా ఢిల్లీలో చేసిన రాజధాని వ్యాఖ్యలపై మంటలు ముసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే విశాఖలో పాలనా రాజధానిని ప్రారంభించనున్నట్టు సీఎం జగన్ ఢిల్లీ వేదికగా వెల్లడించారు. అంతేకాదు.. వచ్చే కొద్ది మాసాల్లోనే తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని అన్నారు. దీంతో ఒక్కసారిగా.. రాజధాని అమరావతి మంటలు రాజుకున్నట్టు అయింది.
వాస్తవానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. రాజధాని రైతులు న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే.. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. వాస్తవానికి ఇది తాజాగా విచారణకు రావాల్సి ఉంది. కానీ, వివిధ కారణాల రీత్యాఇది విచార ణకు నోచుకోలేదు. కానీ, ఇంతలోనే విశాఖను రాజధానిగా ప్రకటించేశారు జగన్.
మరి దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి? అనేది ఆసక్తిగామారింది. 2020లో మూడు రాజధానులు తీసుకువస్తూ..ఏపీ అసెంబ్లీలో చట్టం చేశారు. విశాఖను పాలనా రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా పేర్కొన్నారు. అయితే.. ఇది కోర్టు వివాదాల్లో చిక్కుకోవడం. రైతులు పాదయాత్ర చేయడంవంటి కారణాలతో అనూహ్యంగా వెనక్కి తీసుకున్నారు.
అంటే.. ప్రస్తుతం రాజధానికి సంబంధించి కేంద్రం చేసిన విభజన చట్టం ప్రకారం.. గత చంద్రబాబు ప్రభుత్వంచేసిన చట్టమే ఉంది. అదేవిధంగా సీఆర్ డీఏ మాత్రమే అమల్లో ఉంది. ఇదే విషయాన్ని గతంలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. మరి.. ఇలాంటి సమయంలో సీఎం జగన్ అనూహ్యంగా విశాఖకు రాజధానిని తీసుకువెళ్తున్నామని ప్రకటించడం.. ఆ వెంటనే తాను కూడా వెళ్లిపోతానని చెప్పడం.. వంటివి సంచలనంగానే మారాయి. దీనికి ఆయన ఏం చేయనున్నారు? ఏం చేయాలి? అనేది కూడా చర్చకువ చ్చింది.
ఈ విషయాలను పరిశీలిస్తే.. ఇప్పటికిప్పుడు మరోసారి పక్కాగా.. మూడు రాజధానులకు సంబంధించిన చట్టం రూపొందించాలి. దీనిని సభలో పెట్టి.. ఆమోదించుకోవాలి. ఈ రెండు విషయాలు చేస్తే.. తప్ప.. జగన్ చెబుతున్న విశాఖ రాజధాని, తాను వెళ్లేందుకు కూడా అవకాశం లేదు. సో.. ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే..
ఆయన త్వరలోనే ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ సమావేశాల్లోనే మూడు రాజధానుల విషయాన్ని కూడా సభలో ప్రవేశపెట్టనున్నారని తాడేపల్లి వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది చేయకుండా... త్వరలోనే విశాఖకు రాజధాని వెళ్తుందని జగన్ చెప్పలేదని.. సో.. పక్కా వ్యూహంతోనే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.