కుప్పంలో టీడీపీ వర్సెస్ వైసీపీ.. పోటాపోటీ
చంద్రబాబు సొంత ఇలాకా కుప్పంలో టీడీపీ వర్సెస్ వైసీపీ పోటాపోటీ నెలకొంది. కుప్పం రైతుల తాగునీటి, సాగునీటి సమస్యలు తీర్చాలంటూ టీడీపీ మహా పాదయాత్ర చేపట్టింది. ఇందుకోసం వెంటనే హంద్రీనీవా ఎత్తిపోతల పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి కుప్పంకు నీరందించాలని టీడీపీ ఈ మహా పాదయాత్రను ప్రారంభించింది.
కాగా టీడీపీ మహా పాదయాత్రను కరోనా పేరుతో పోలీసులు అనుమతించకపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇది కాస్త కుప్పం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది.
టీడీపీ మహా పాదయాత్రకు నిరసనగా వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగారు. భారీ ర్యాలీ తీయడానికి రెడీ కావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
దీంతో అలెర్ట్ అయిన పోలీసులు టీడీపీ నేతలను అడ్డుకొని గృహనిర్బంధం చేశారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు.
టీడీపీ మహా పాదయాత్రను అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని.. ఇది అప్రజాస్వామికం అని ఆరోపించారు. తన నియోజకవర్గమైన కుప్పంపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు హంద్రీ నీవా కాలువలను పూర్తి చేసి ఎందుకు కుప్పంకు నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో కుప్పంలో ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొంది.