వైసీపీ ఎంపీ దీక్షలో కూర్చున్న టీడీపీ ఎంపీ!

Update: 2020-09-11 06:07 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో దేవాలయాల పరిక్షణ కోసం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు దీక్షకి పూనుకున్నారు. దేవాలయాల పరిరక్షణ కోసం నరసాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామ కృష్ణంరాజు నేడు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో దీక్ష నిర్వహించనున్నారు. దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా గాంధేయ పద్దతిలో 8 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు దీక్షకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మద్దతు తెలిపారు. ఎంపీకి సంఘీభావంగా దీక్షలో కూర్చుకున్నారు. రఘురామ దీక్షకు మరికొందరు ప్రముఖులు కూడా మద్దతు తెలిపారు.ఏపీలో దేవాలయాల పరిరక్షణ కోసం ఎంపీ రఘురామ కృష్ణరాజు శుక్రవారం ఉదయం ఈ దీక్షకు కూర్చుకున్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా గాంధేయ పద్దతిలో 8 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఢిల్లీలోని తన నివాసంలో ఈ దీక్షకు పూనుకున్నారు.

ఏపీ లోని దేవాలయాలపై దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలపై ఉన్నతస్థాయిలో దర్యాప్తు జరిపించాలని సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవాలయాల పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ దీక్షా కార్యక్రమానికి కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నైతిక మద్దతు ఇవ్వాలని కోరారు .
Tags:    

Similar News