జలీల్...ఆశలు ఢమాల్...
జలీల్ ఖాన్...పదవుల కోసం ప్రజల నిర్ణయాన్ని కాదని పార్టీ మారిన శాసనసభ్యుడు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యునిగా ఎన్నికైన జలీల్ ఖాన్ పదవుల కోసం అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ చేరిక అనైతికమని - పదవుల కోసమేనని విజయవాడ ప్రజలు ఎప్పుడో తేల్చేసారు. అయిన జలీల్ ఖాన్ మాత్రం మంత్రి పదవిపై ఇంకా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన ఆశాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడియాశాలు చేసారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరినప్పుడు జలీల్ ఖాన్ కు మంత్రి పదవితో పాటు పలు తాయిలాలు ఇస్తామని అన్నట్లు ప్రచారం జరిగింది. తెలుగుదేశం పార్టీలో చేరిన వెంటనే మంత్రి వర్గ విస్తరణ చేపడితే అనుమానాలు వస్తాయనే భయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ విస్తరణను వాయిదా వేసారు. ఇదే సమయంలో జలీల్ ఖాన్ కు వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఈ పదవితో సంత్రుప్తి చెందని జలీల్ ఖాన్ మంత్రి పదవి కోసం తన ప్రయత్నాలను ముమ్మరం చేసారు. అయిన అవి ఫలించలేదు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఏడాదిలోపే గడువున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం హఠాత్తుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. ఇదీ పార్టీ శ్రేణులలో కూడా ఆశ్చర్యాని కల్గించింది. అయితే జలీల్ ఖాన్ మాత్రం ఈ మంత్రి వర్గ విస్తరణలో తనకు అవకాశం తప్పకుండా ఉంటుందని ఆశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తొలి నుంచి తెలుగుదేశం నాయకుడిగా ఉన్న ఫరూక్ ను మంత్రిగా చేసారు. మైనారిటీ కోటలో తనకే అవకాశం అని జలీల్ ఖాన్ ఆశగా ఉన్నారు. ఆయనని కాదని తెలుగుదేశం పార్టీ మైనారిటీ వివాదంలో సీనియర్ నాయకుడైన ఫరూక్ కు మంత్రి పదవి ఇవ్వడంతో జలీల్ ఖాన్ కు ఎదురు దెబ్బె తగిలిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ పరిణామం వచ్చే ఎన్నికలలో ఎంతో ప్రభావం చూపుతుందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా జలీల్ ఖాన్ కు టిక్కెట్టు దక్కె అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం వక్ఫ్ బోర్డు చైర్మన్ గా జలీల్ ఖాన్ తీసుకున్న నిర్ణయాలే అని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వర రావు మార్కెట్ కు ఎదురుగా ఉన్న స్దలాన్ని ప్రైవేటు సంస్దకు కట్టబెట్టాలని జలీల్ ఖాన్ తీసుకున్న నిర్ణయమే ఆయన రాజకీయ పతనానికి కారణమవుతుందని పరిశీలకులు చెబుతున్నారు.