టీడీపీలో మరో విషాదం.. సీనియర్ నేత మృతి

Update: 2020-09-12 05:00 GMT
తెలుగుదేశం పార్టీలో మరో విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత మృతి చెందారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ కీలక నేత మారుతీ వరప్రసాద్ అనారోగ్యం కారణాలతో మరణించారు.

వరప్రసాద్ మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేష్ , టీడీపీ నేతలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

పులివెందులలో టీడీపీ సీనియర్ నేతల వరప్రసాద్ ఉన్నారు. అటవీ శాఖ మాజీ డైరెక్టర్ గా పనిచేశారు.  రిటైర్ అయ్యాక టీడీపీలో చేరి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఈ సందర్భంగా వరప్రసాద్ మరణం టీడీపీకి తీరని లోటు అని మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేశారు.
Tags:    

Similar News