వలంటీర్లు పంచాయితీ పోరులో వద్దంటున్న టీడీపీ

Update: 2021-01-23 11:30 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవాల్టి నుంచి ఏపీలో తొలి విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఎన్నికల ప్రక్రియలో వలంటీర్లను దూరంగా ఉంచాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. ఈమేరకు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

   ఎన్నికల ప్రక్రియలో గ్రామ వలంటీర్లను ఎన్నికలకు ప్రక్రియకు దూరంగా ఉంచాలని.. గ్రామ వలంటీర్లను అధికార వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం కోసం వాడటమే కాకుండా వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  

గత ఎన్నికల్లో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని.. ఓ వర్గం పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని వర్ల రామయ్య తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ దృష్టికి తీసుకొచ్చారు.

ఇక విధులను ఒక రెవెన్యూ డివిజన్ లో పనిచేసే సిబ్బంది అక్కడే నియమించకుండా వేరే డివిజన్లకు డ్యూటీలు వేయాలని నిమ్మగడ్డను టీడీపీ నేతలు కోరారు. ఇక గత అనుభవాల దృష్ట్యా బదిలీలు చేసి సమర్థులను ఇందులో బాధ్యతలు అప్పజెప్పాలని సూచించారు.
Tags:    

Similar News