• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబుకు షాక్.. కడప ఫైర్‌...

బాబుకు షాక్.. కడప ఫైర్‌ బ్రాండ్ నేత వైసీపీలోకి!

By - Tupaki Desk
Update: 2019-07-29 04:19 GMT
కడప జిల్లా కమలాపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి - వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతానని అధికారికంగా ప్రకటించారు. టీడీపీకి రాజీనామా లేఖను పంపానని.. అనుచరులతో చర్చించి జిల్లా అభివృద్ధి కోసం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన కుమారుడు అనిల్‌ కుమార్‌ రెడ్డితోపాటు కేడర్ మొత్తం పార్టీలో చేరుతున్నామని చెప్పారు.

మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు తనకు టికెట్‌ ఇవ్వకుండా మోసం చేశారని వీరశివారెడ్డి మండిపడ్డారు. బాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. అందుకే పూర్తిగా తిరస్కరించారన్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందనను గమనించకుండా.. ఓడిపోయే వారికే చంద్రబాబు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తానన్నారు. సీఎం జగన్‌ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తారనే నమ్మకం ఉందన్నారు.

కాంగ్రెస్ హయాంలో కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వీరశివారెడ్డి రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కానీ చంద్రబాబు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పుత్తా నరసింహారెడ్డికే టికెట్ ఇచ్చారు. దీంతో శివారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.. ప్రచారానికి కూడా వెళ్లలేదు. అప్పట్లోనే ఆయన వైసీపీలో చేరుతారని భావించారు. వైసీపీ నేతలతో భేటీ కూడా అయ్యారు. దీంతో చంద్రబాబు పిలిచి బుజ్జగించడంతో పార్టీలో కొనసాగారు.  అయితే.. ఎన్నికల తర్వాత వీరశివారెడ్డిని ఎంపీ అవినాష్‌ రెడ్డితో పాటూ ఇతర వైసీపీ నేతలు కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. అప్పుడు కూడా ఆయన చేరలేదు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.


Tags:    
  • TDP EX-MLA 
  • Veera Siva reddy 
  • YCP 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS