ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియాపై చర్యలు తీసుకోండి: జియో

Update: 2020-12-15 04:14 GMT
దేశ టెలికాం రంగంలో డిజిటల్ విప్లవాన్ని సృష్టించిన జియో ధాటికి ప్రత్యర్థి టెలికాం కంపెనీలు కుదేలయ్యాయి. వోడాఫోన్, ఐడియాలు అయితే విలీనం అయిన పరిస్థితి తలెత్తింది. ఇక ఎయిర్ టెల్ కాస్త గట్టిగానే నిలబడ్డా.. జియో ఆఫర్ల ముందు తడబడుతోంది.

ఈ క్రమంలోనే ఈ టెలికాం ఆపరేటర్ల ముందర కొత్త లొల్లి మొదలైంది. వోడాఫోన్-ఐడియా, ఎయిర్ టెల్ సంస్థలు అనైతికంగా మొబైల్ నంబర్ పోర్టబులిటీ (ఎంఎన్పీ)కి పాల్పడుతున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ కు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తాజాగా లేఖ రాసింది.

ఉత్తర భారత్ లో ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల ఉద్యమంలో ఈ రెండు సంస్థలు అనైతికంగా ఎంఎన్పీకి పాల్పడుతున్నాయని జియో ఆరోపించింది. జియో నుంచి తమ నెట్ వర్క్ లకు మారడం అంటే రైతులకు మద్దతు పలకడమేనంటూ అర్థరహిత వ్యాఖ్యలు ఇవి చేస్తున్నాయని జియో ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా లేఖకు జతచేసింది.

జియో ఆరోపణలను ఎయిర్ టెల్ ఖండించింది. తాము పోటీదారులను, భాగస్వాములను గౌరవిస్తామని.. నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. పారదర్శక వ్యాపారం చేస్తున్నామని తెలిపింది.
Tags:    

Similar News