సుష్మా స్వరాజ్ తోలి జయంతి...భావోద్వేగమైన ట్విట్ చేసిన ఆమె భర్త !

Update: 2020-02-14 10:41 GMT
రాజకీయాలలోకి ఎంతోమంది వస్తుంటారు ..పోతుంటారు. కానీ , కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి వారి చాలా అరుదుగా ఉంటారు ..వారిలో ఒకరే "సూపర్‌ మామ్‌ సుష్మా స్వరాజ్‌ ". సమస్య ఏదైనా కూడా ఆమె వద్దకి వెళ్ళింది అంటే పరిష్కారం దొరకాల్సిందే. ఎవరైనా సహాయం చేయాలనీ ఆమెని కోరితే , క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారు కోరిన విధముగా తగిన సహాయం చేసే గొప్ప మనసున్ననేత. దేశ రాజకీయాలలో చిన్నమ్మగా పేరుతెచ్చుకున్న సుష్మా స్వరాజ్‌ గత ఏడాది ..2019 ఆగస్టు 6న కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆకస్మికంగా మరణించారు. నేడు ఈ మహానేత సుష్మా స్వరాజ్‌ గారి మొదటి జయంతి.

ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్‌ భర్త కౌశల్‌ స్వరాజ్‌ ట్విటర్‌ అకౌంట్‌ లో వారి కుమార్తె బన్సూరీ స్వరాజ్‌ షేర్‌ చేసిన ఫొటో.. అభిమానులకు మరోసారి ఆమె రూపాన్ని గుర్తుకు తెస్తోంది. ‘‘హ్యాపీ బర్త్‌ డే! మా జీవితాల్లోని సంతోషం సుష్మా స్వరాజ్‌’’ అంటూ కుటుంబ సభ్యులు ఆమెకు బర్త్ డే విషెష్ తెలియజేసారు. కేకు కట్‌ చేసేందుకు చేతిలో కత్తి పట్టుకుని చిరునవ్వు చిందిస్తున్న సుష్మా ఫోటో చూసిన నెటిజన్స్ .. మీరు ఈ లోకం విడిచి వెళ్లినా కూడా ... మీరెప్పుడూ మా హృదయాల్లో సజీవంగానే ఉంటారు అంటూ భావోద్వేగపూరిత ట్వీట్లు చేస్తున్నారు. వీరిది ప్రేమ వివాహం. సనాతన  కుటుంబానికి చెందిన సుష్మా స్వరాజ్‌ ఎన్నో అడ్డంకులను అధిగమించి.. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి స్వరాజ్‌ కౌశల్‌ ని వివాహం చేసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ అమలులోకి వచ్చిన తొలినాళ్లలోనే 1975 జూలై 13న వీరి వివాహం జరిగింది. కాగా ప్రేమికుల దినోత్సం రోజున జన్మించిన సుష్మా స్వరాజ్‌.. మొదటి జయంతి సందర్భంగా ఆమె భర్త కౌశల్‌ తన భార్యకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం చేసిన ట్వీట్‌ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది ..

ఇకపోతే ,ప్రధాని నరేంద్ర మోదీ తొలి కేబినెట్‌ లో విదేశాంగ మంత్రిగా పని చేసిన ఆమె.. ఇందిరా గాంధీ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా రికార్డ్ సృష్టించారు. విదేశాంగ బాధ్యతలను నిర్వర్తించిన సమయంలో.. ప్రవాస భారతీయులకు అనుక్షణంగా అండగా నిలుస్తూ - వారికీ ఏ అవసరం వచ్చినా - క్షణాల వ్యవధిలో రియాక్ట్ అవుతూ వారికీ ఏ ఆపద లేకుండా చూసుకునేవారు. ఆమెకు ఓ ట్వీట్ చేస్తే చాలు సమస్య పరిష్కరమయ్యేది. కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంటేషన్ చేయించుకున్న సుష్మా స్వరాజ్ ఇన్ఫెక్షన్ల బారిన పడొద్దనే ఉద్దేశంతో 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కానీ మోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఆమె చనిపోయారు. హర్యానాలో 1952లో పుట్టిన సుష్మా స్వరాజ్ .. 1998లో ఢిల్లీ సీఎంగా కూడా పని చేశారు.
Tags:    

Similar News