సూర్య నూ సూపరబ్బా.. కెప్టెన్ కోసం వికెట్ త్యాగం

Update: 2020-11-11 07:10 GMT
ఐపీఎల్లో మంగళవారం ఢిల్లీతో  జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించి ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది.  ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ 51 బంతుల్లో 68 పరుగులు సాధించి ముంబాయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్ చేయగా అర్థ సెంచరీకి చేరువలో ఉన్న రోహిత్ శర్మ నిర్లక్ష్యంగా వ్యవహరించి రనౌట్  కా బోయాడు. అయితే సూర్యకుమార్ త్యాగంతో బతికిపోయాడు. అయితే తన కోసం సూర్య కుమార్ వికెట్ త్యాగం చేయడంపై రోహిత్ శర్మ స్పందించాడు. తన నిర్లక్ష్యం కారణంగానే సూర్య కుమార్ అవుట్ కావాల్సి వచ్చిందన్నారు. అతడికి బదులుగా తానే త్యాగం చేసి  ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాడు. 11 వ ఓవర్ ఐదో బంతిని ఎదుర్కొన్న రోహిత్ శర్మ బ్యాక్ ఫుట్ షాట్ ఆడాడు. అది ఫీల్డర్ ప్రవీణ్ దూబే వైపు వెళ్ళింది. అయితే ఆ సమయంలో లేని పరుగు కోసం రోహిత్ శర్మ నాన్  స్ట్రైకర్ ఎండ్ వైపుగా పరుగుతీశాడు. అప్పటికే బాల్ ప్రవీణ్ చేతుల్లోకి వెళ్లడంతో అటువైపు క్రిజ్ లో ఉన్న సూర్య కుమార్ వద్దు.. రావద్దంటూ.. రోహిత్ శర్మను వారించాడు. అయితే అది పట్టించుకోని రోహిత్ నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు సగం పిచ్ దాటుకుని వచ్చేశాడు.

అప్పటికే ప్రవీణ్ బంతిని వికెట్ కీపర్ వైపు విసరడంతో రోహిత్ శర్మ అవుట్ అవ్వడం ఖాయమని భావించిన సూర్యకుమార్.. అవుట్ అవుతారు అని తెలిసి కూడా స్ట్రైకింగ్ అండ్ వైపు పరుగు అందుకున్నాడు. ఆలోగా కీపర్ చేతిలోకి బాల్ రావడం అతడు బెయిల్స్ ని  గిరాటేయడం  జరిగిపోయింది. దీంతో సూర్యకుమార్ మిలియన్ దారి పట్టాడు. అప్పటికి సూర్య 20 బంతుల్లో ఓ సిక్సర్, ఫోర్  సాయంతో 20 పరుగులు చేసి ఉన్నాడు. అయితే అతడు అవుట్ అయిన సమయంలో అతడి ముఖంలో ఎటువంటి బాధ, అసహనం కనిపించలేదు. సూర్య ఔట్  అవగానే రోహిత్ శర్మలో తీవ్ర నిరాశ కనిపించింది. అతడు అవుట్ కావడం హిట్ మ్యాన్ ని తీవ్రంగా కలచి వేసింది. కాసేపు అలాగే పిచ్ పై  మోకాళ్లపై కూర్చుండిపోయాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం దీనిపై రోహిత్ శర్మ మాట్లాడుతూ 'సూర్య కుమార్ ఎంతో పరిణితి చెందిన ఆటగాడు. ఈ అతడు  అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అతడి కోసం నావికెట్ త్యాగం చేసి ఉండాల్సింది.' అని పేర్కొన్నాడు.  కాగా కెప్టెన్ కోసం తన వికెట్లు త్యాగం చేసి క్రీడా స్ఫూర్తి చాటిన సూర్యకుమార్ పై అభిమానులు  ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. క్రీడాస్ఫూర్తి చాటావంటూ  కొనియాడుతున్నారు.
Tags:    

Similar News