ఖైదీలకు శుభవార్త చెప్పిన సుప్రీం .. ఇక అందులో ఆలస్యం ఉండదు!
జైళ్లలో ఉండే ఖైదీలు పడే కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కవే అవుతుంది. ఖైదీలకు సంబంధించి వివాదాలు మనం ఎక్కువగా కూడా చూస్తున్నాము. బెయిల్ వచ్చినా సరే వివిధ కారణాలతో కొందరు ఖైదీలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బెయిల్ వచ్చిన వెంటనే విడుదల చేయకుండా , చట్టంలో ఉన్న లోసుగులతో కొందరు ఖైదీలను ఇబ్బంది పెడుతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే సుప్రీం కోర్ట్ కీలక అడుగు వేసింది.
సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని సంచలన నిర్ణయాల దిశగా సుప్రీం అడుగులు వేస్తుంది. అన్ని విధాలుగా మార్పులకు శ్రీకారం చుడుతుంది సుప్రీం కోర్ట్. ఇప్పుడు మరో నిర్ణయం తో ఖైదీలకు గుడ్ న్యూస్ చెప్పింది. బెయిల్ మంజూరీ అయిన వెంటనే విడుదలయ్యేలా ఫాస్టర్ విధానం అమలుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఖైదీల విడుదల చేసేలా సిజె ఐ ఎన్వీ రమణ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
కోర్టులు బెయిల్ మంజూరీ చేసినా సాంకేతిక కారణాలతో ఖైదీల విడుదలలో జరుగుతున్న జాప్యంపై సుమోటో గా కేసు విచారణను చేపట్టిన సుప్రీం ధర్మాసనం, ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఖైదీల విడుదలలో జాప్యాన్ని నివారించేందుకు ఫాస్టర్ విధానం అమలుకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు సంబంధిత జైళ్లకు వెను వెంటనే చేరేందుకు ఫాస్టర్ విధానాన్ని అమలు చేయాలని సుప్రీం ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చింది. అన్ని జైళ్లలో ఇంటర్‌నెట్ సౌకర్యాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సిఎస్ లకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.అంతవరకూ నోడల్ ఏజెన్సీ ద్వారా ఫాస్టర్ విధానాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫాస్టర్ విధానం ద్వరా ఇకపై మెయిల్ లో సంబంధిత జైళ్ల కే బెయిల్ ఉత్తర్వులు చేరే అవకాశం ఉంటుంది.