టీకాల రేటుపై కేంద్రాన్ని కడిగేసిన సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ విషయంలో టీకా ధరల్లో వ్యత్యాసంపై కేంద్రాన్ని సుప్రీం కోర్టు కడిగిపారేసింది. కేంద్రం తీరుపై ప్రశ్నల వర్షం కురిపించింది. టీకా విధానం, సేకరణ, ధరల్లో తేడా, గ్రామీణ ప్రాంతాల్లో టీకా రిజిస్ట్రేషన్.. ఇలా పలు సమస్యలపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది.
ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వేర్వేరు వ్యాక్సిన్ల ధరల పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకే దేశంలో వేర్వేరు ధరలను ఎందుకు అమలు చేయాల్సి వచ్చిందని నిలదీసింది. జాతీయ టీకా విధానంలో వేర్వేరు రేట్లు ఉండొచ్చా? అని ప్రశ్నించింది.
వ్యాక్సిన్ల సేకరణ వ్యవహారంలో రాష్ట్రాలు అధిక రేటును ఎందుకు చెల్లించాల్సి వస్తోందని సుప్రీంకోర్టు సూటిగా మోడీ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. కోవిన్ ఫ్లాట్ ఫామ్ ద్వారా మాత్రమే తమ పేర్లను నమోదు చేసుకున్న వారికి టీకాలు ఇస్తే అది తెలియని గ్రామీణుల మాట ఏమిటని కేంద్రాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. జాతీయ స్థాయిలో ఒకే విధానాన్ని అమలు చేయాల్సిన కేంద్రప్రభుత్వం.. వ్యాక్సిన్ల సేకరణ విషయంలో రాష్ట్రాలపై అధిక భారాన్ని మోపడం సరికాదని పేర్కొంది.
45 సంవత్సరాలకు పైనున్న వయసు గల వారికి 100శాతం మేర టీకాలను సమకూర్చిన కేంద్రప్రభుత్వం.. 18-44 ఏళ్ల వారి కోసం అందులో సగం కూడా అందుబాటులోకి ఎందుకు తీసుకొని రాలేకపోయిందని నిలదీసింది. దేశంలో 45 ఏళ్లలోపు వారే అధికంగా కరోనా బారిన పడి మరణించారని.. వారి కోసం ఎందుకు వ్యాక్సిన్లను చాలినంతగా అందుబాటులో ఉంచలేకపోయారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకరకంగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇంకో రకంగా వ్యాక్సిన్ రేట్లను నిర్ధారించారని.. ఏ ప్రాతిపదికన ఇలా వేర్వేరుగా రేట్లను ఖరారు చేశారని పేర్కొంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లకు ఒకే ధర ఉండేలా చూడాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది.