ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీకి అంత పెద్ద కథ?

Update: 2020-09-13 00:30 GMT
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ పోరాడుతున్నది కరోనా వైరస్ పైనే. ఈ మహమ్మారిని అరికట్టడానికి ఆపసోపాలు పడుతున్నారు. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వస్తే తప్ప దీన్ని నియంత్రించడం సాధ్యంకాదు. ఈ క్రమంలోనే పరిశోధకులు డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ రెడీకి ప్రయత్నిస్తున్నారు.

అయితే వ్యాక్సిన్ కనిపెట్టడం సరే.. మరి దీనిని ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడం ఎలా అనే సందేహం రావచ్చు. ఇదో పెద్ద ప్రయాస కూడా.. దీనికి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ట్రాన్స్ పోర్టు అసోసియేషన్ (ఐఏటీఏ) క్లారిటీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయడానికి కనీసం 8000 జంబో జెట్ విమానాలు అవసరం అవుతాయని బాంబు పేల్చింది.

ఈ మేరకు ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాక్సిన్ చేరవేయడానికి ప్రపంచదేశాలన్నీ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐఏటీఏ సూచించింది. వ్యాక్సిన్ ను సురక్షితంగా చేరవేయడంతో ఈ శతాబ్ధపు అతిపెద్ద సవాల్ అని అభిప్రాయపడింది. భద్రతా ఏర్పాట్లు, బోర్డర్ ప్రాసెసర్ వంటి వాటిని సులభతరం చేయడంలో ప్రభుత్వాలు ముందడుగు వేయాలన్నారు.

కాగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ట్రాన్స్ పోర్టు అసోసియేషన్ (ఐఏటీఏ)లో 290 విమానయాన సంస్థలకు ప్రాతినిధ్యం ఉంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోని ప్రతీ వ్యక్తికి వ్యాక్సిన్ అందించేందుకు 8747 కార్గో విమానాలు అవసరం అవుతాయని అంచనా వేస్తోంది.
Tags:    

Similar News