పవన్ తో సోము వీర్రాజు భేటి.. తిరుపతి సీటుపైనేనా?

Update: 2021-01-24 16:54 GMT
తిరుపతిలో ఇటీవల పర్యటించిన జనసేనాని పవన్ కల్యాణ్ రాష్ట్ర బీజేపీ నేతలతో తనకు గ్యాప్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ నేతలతో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఈ క్రమంలోనే అలెర్ట్ అయిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈరోజు హైదరాబాద్ వచ్చి పవన్ కళ్యాన్ ను కలిశారు. అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చిన సోము వీర్రాజు పవన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటి అయ్యారు.

తిరుపతి ఎంపీ అభ్యర్థి, ఏపీలో రాజకీయ పరిస్థితులు.. కలిసి సాగడంపై వీరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఇద్దరూ సుమారు అరగంటకు పైగా చర్చించినట్టు సమాచారం. ప్రధానంగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిపై ఈ సమావేశం ప్రధానంగా సాగినట్టు తెలుస్తోంది.

ఏపార్టీ నుంచి పోటీచేసినా ఉభయ పార్టీల అభ్యర్థిగా బరిలోకి దిగాలని.. రెండు పార్టీలు అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని కోరినట్టు తెలిసింది.

భేటి అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. 2024లో బీజేపీ, జనసేన లు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యం అని ఆయన ప్రకటించారు. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నామన్నారు. ఇరు పార్టీల ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్లేలా చర్చించినట్టు తెలుస్తోంది. కుల, మత వర్గాల బేధాలు లేకుండా.. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పయనిస్తామని ఇద్దరు నేతలు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ-జనసేన పార్టీల మధ్య ఉన్న గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేయడానికే ఈ భేటి జరిగిందని తెలుస్తోంది.



Tags:    

Similar News