అండర్ వేర్ కామెంట్స్.. జయప్రద కన్నీల్ల పర్యంతం

Update: 2019-04-15 11:15 GMT
ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ పార్లమెంట్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిలబడిన జయప్రదపై దారుణ కామెంట్స్ చేసిన అజాంఖాన్ కు కౌంటర్ ఇచ్చింది జయప్రద. జయప్రద వేసుకున్న అండర్ వేర్ ఖాకీ రంగులో ఉంటాయంటూ నోరుజారిన అజాంఖాన్ వ్యాఖ్యలపై దుమ్మెత్తిపోసింది.

జయప్రద సోమవారం ఎన్నికల ప్రచార సభ లో మాట్లాడుతూ  అజాంఖాన్ తనపై దారుణ వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదని.. 2009లోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడని వాపోయింది. అజాంఖాన్ కు తానేం అన్యాయం చేశానో తనకు తెలియదని ఆమే ఆవేదన వ్యక్తం చేసింది. అజాంఖాన్ ను ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలని జయప్రద ఈసీని డిమాండ్ చేసింది. ఒకవేళ  అజాంఖాన్ గెలిస్తే యూపీలో ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని.. మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మహిళలకు సమాజంలో రక్షణ ఉండదని తెలిపారు. ఇలాంటి మాటలు మాట్లాడే వారిని ఎన్నుకుంటారా అని ఆమె రాంపూర్ ప్రజలను ప్రశ్నించారు.

ఇక తాను చావాలా.. అప్పుడే అజాంఖాన్ తృప్తిగా ఉంటుందా అని జయప్రద కన్నీల్ల పర్యంతం అయ్యారు. నీ మాటలకు నేను భయపడి వెళ్లిపోతానని అనుకుంటున్నావని.. కానీ రాంపూర్ వదిలి వెళ్లేది లేదని జయప్రద స్పష్టం చేశారు.

కాగా జయప్రదపై అండర్ వేర్ కామెంట్స్ చేసిన అజాంఖాన్ మీడియాకు వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు జయప్రదపై చేయలేదన్నారు.


Tags:    

Similar News