సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్యలో షాకింగ్ ట్విస్టు.. భార్య కూడా నిందితురాలే

Update: 2020-11-25 05:00 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సజీవ దహనం కసు విచారణలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. బంధువుల ఇంటికి వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ పవన్ హత్య కేసులో అతడి భార్య క్రిష్ణవేణికి కూడా సంబంధం ఉందన్న సంచలన విషయాన్ని పోలీసులు తాజాగా వెల్లడించారు. అన్ని పథకం ప్రకారమే అతన్ని చంపేసినట్లు చెబుతున్నారు.

జగిత్యాల జిల్లా మల్యాల మండలం జల్వంతాపూర్ శివారులో జరిగిన హత్య కేసు సంచలనంగా మారటం తెలిసిందే. బావమరిది మరణం నేపథ్యంలో కర్మ రోజున పరామర్శించేందుకు వెళ్లిన పవన్ ను హత్య చేయటం.. చేతబడి చేశారన్న అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. అయితే.. ఈ హత్య కేసును విచారించిన పోలీసులు సంచలన నిజాల్ని వెల్లడించారు.

తన భర్తను చంపినట్లుగా కంప్లైంట్ ఇచ్చిన భార్య క్రిష్ణవేణి సైతం నిందితురాలని.. కాల్చి చంపే ప్రయత్నంలో తన సహకారాన్ని అందించినట్లుగా చెప్పారు. అన్నతో కలిసి భర్తను చంపేసిందని.. ఈ ఉదంతంలో మొత్తం ఏడుగురిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య వెనుక గడిచినకొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలే కారణమని భావిస్తున్నారు.

ఏడాది క్రితం క్రిష్ణవేణి బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లారు. ఆ సమయంలో ఆమెకు చెందిన ఆరు తులాల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. దీంతో.. భార్యభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. వాటిని బావమరిది జగన్ దొంగలించినట్లుగా దూషిస్తూ.. పవన్ అనుమానించేవాడు. అతడ్ని చంపుతానని బెదిరించేవాడు. ఇటీవల అనారోగ్యంతో జగన్ మరణించాడు. అయితే.. పవన్ చేతబడి చేయించటం వల్లే ఈ దారుణం జరిగిందని క్రిష్ణవేణి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

పన్నెండోరోజు కర్మకు భార్యతో పాటు హాజరైన పవన్ ను ఒక గదిలో ఉంచి బయట తాళం వేయటం.. అతడిపైన పెట్రోల్ పోసి నిప్పు అంటించి.. సజీవదహనమయ్యేలా ప్లాన్ చేశారు. అనంతరం భర్తను హత్య చేసినట్లుగా క్రిష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఇదంతా పక్కా ప్లాన్ అని.. పవన్ ను చంపే విషయంలో భార్య.. అతని సోదరులు కలిసి చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. 
Tags:    

Similar News